IND vs AUS: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు భారత్‌.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం

India Beats Australia in Champions Trophy 2025 Semi Final
x

IND vs AUS: ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు భారత్‌.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘనవిజయం

Highlights

IND vs AUS: రోహిత్ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ల్లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించి అజేయంగా టోర్నీలో ఆఖరి పోరుకు బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.

IND vs AUS: రోహిత్ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ల్లోకి అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించి అజేయంగా టోర్నీలో ఆఖరి పోరుకు బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఐదో సారి ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా సగర్వంగా ఫైనల్స్ కు చేరింది. దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్‌లో చివరి వరకు నున్నా నేనా అమన్నట్టు సాగిన మ్యాచ్ లో చివరకు టీమిండియా ఆదిపత్యం కొనసాగించింది.

మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చాడు. 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. గిల్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి 91 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పారు. అయ్యర్ 45 పరుగులు చేసి అవుట్ అవగా.. కో‌హ్లి 84 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర కోహ్లీ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్ది్క్ పాండ్యా కలిసి చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో టీమిండియా లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 రన్స్‌కు ఆలౌట్ అయింది. పేసర్‌ షమీ 48 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, జడేజాకు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఆరంభంలోనే ఓపెనింగ్‌ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేసిన టీమిండియా బౌలర్లు ఆ తర్వాత ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసి పట్టుబిగించారు. అయితే క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌.. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా రన్‌రేట్ రొటేట్ చేస్తూ వచ్చాడు. అయితే 198 రన్స్ దగ్గర స్మిత్‌ను అవుట్ చేయడంతో టీమిండియా మరోసారి పట్టుబిగించింది. వెంటనే మాక్స్‌వెల్ కూడా అవుట్ అవడంతో తక్కువ స్కోరుకే ఆసీస్‌ను కట్టడి చేయగలిగింది టీమిండియా. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లలో స్మిత్ 73 రన్స్ చేయగా.. అలెక్స్ కేరీ 61, ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు. ఈ విజయంతో ఫైనల్‌లోకి అడుగుపెట్టిన భారత్.. ఈనెల 9న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌లో తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories