Ball Tampering: లార్డ్స్‌ టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్‌ కలకలం

India Batting Coach Responds After England Accused of Ball Tampering at Lords Stadium
x

బాల్ టాంపరింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ప్లేయర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Ball Tampering:బంతిని కాళ్లకింద పెట్టి ఆకారాన్ని మార్చే యత్నం * సోషల్‌ మీడియాలో ఫొటోలు వైరల్‌

Ball Tampering: లార్డ్స్‌ మైదానంలో భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌ కలకలం రేపింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు తమ బూట్ల కింద బంతిని పెట్టి, దాని ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఇది బాల్‌ ట్యాంపరింగేనంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ ఆటగాళ్లు ఎవరనేది ఇంకా తెలియలేదు. మరోవైపు ఈ ఘటనపై టీమిండియా మాజీ ఓపెనర్‌ సెహ్వాగ్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించారు. ఇది బాల్ ట్యాంపరింగా లేక, కరోనా నివారణ చర్యా అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేయగా.. ఇది బాల్ ట్యాంపరింగేనా? అని ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌ చేశాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories