భారత్ , బంగ్లా రెండో టీ20పై సందిగ్ధం

2nd T20
x
2nd T20
Highlights

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టీ20పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల రెండో టీ20 నవంబర్ 7న జరగనుంది. మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో...

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టీ20పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల రెండో టీ20 నవంబర్ 7న జరగనుంది. మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ముందజలో ఉంది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ కు బంగ్లా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లా, టీమిండియా మధ్య రెండో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్‌ వేధికగా జరగనుంది. అయితే గుజరాత్ లోని డయు, పోర్ బందర్ మధ్య మహా తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహా తుపాను తీరం దాటే ముందు రాజ్ కోట్ సహా చూట్టు ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే రెండో టీ20కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికి టీ20 నిర్వహిస్తామని వాతావరణ పరిస్థితులు నిరంతరం గమనిస్తున్నామని తెలిపింది. మ్యాచ్ ముందు రోజు లేదా అదే రోజు ఉదయం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం మ్యాచ్ ప్రారంభమవుతోందని అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఓ అధికారి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories