India vs NewZealand: కాన్పూర్ టెస్టులో పట్టుబిగిస్తున్న టీమిండియా

India and New Zealand Match in Kanpur Today 27 11 2021
x

 కాన్పూర్ టెస్టులో పట్టుబిగిస్తున్న టీమిండియా(ఫైల్ ఫోటో)

Highlights

* కివీస్‌ను 296 పరుగులకు కట్టడి చేసిన భారత్ * 63 పరుగుల ఆధిక్యంలో ఉన్న అజింక్య రహానే సేన

India vs NewZealand: కాన్పూర్ టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. భారత స్పిన్ విభాగం ఉచ్చులో చిక్కుకున్న కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటయింది. భారత లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా 1, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. ఇక పేసర్ ఉమేష్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కింది.

ఓవర్ నైట్ స్కోర్ 129 పరుగులతో మూడోరోజు ఆట ఆరంభించిన న్యూజిలాండ్‌ 151 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. 89 పరుగులు చేసిన విల్ యంగ్ అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ లాథమ్ 95 పరుగుల దగ్గర తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ఆ తర్వాత కివీస్ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది.

ఇక కివీస్ బ్యాటర్లలో విలియమ్సన్ 18, రాస్ టేలర్ 11, కైల్ జేమీసన్ 23 పరుగులు చేశారు. అనంతర్ రెండో ఇన్నింగ్ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన గిల్ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు.

ఒకే ఒక్క పరుగు చేసిన గిల్ జేమీసన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇక మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. మొత్తంగా 63 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories