IND vs NZ Test Series: అవాక్కవ్వకండి టైడ్ వాడండి.. జెర్సీలపై ఫ్యాన్స్ జోకులు

IND vs NZ Test Series: అవాక్కవ్వకండి టైడ్ వాడండి.. జెర్సీలపై ఫ్యాన్స్ జోకులు
x
జెర్సీలపై ఫ్యాన్స్ జోకులు
Highlights

న్యూజిలాండ్-భారత్ జట్లు మరో సంప్రదాయ క్రికెట్‌ పోరుకు సిద్ధమయ్యాయి. దైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్-భారత్ జట్లు మరో సంప్రదాయ క్రికెట్‌ పోరుకు సిద్ధమయ్యాయి. దైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. సంప్రదాయక ఆటలో ఇరుజట్లు అమీతుమి తేల్చుకోవడానికి రెడీ అయ్యాయి. టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతున్న సిరీస్‌ కావడంతో రెండు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి.

ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు బుధవారం మీడియాతో మాట్లాడారు. అలాగే ప్రీ సిరీస్ ఫొటో షూట్‌లోనూ పాల్గొన్నారు. వీటికీ సంబంధించిన ఓ ఫొటోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్విటర్ లో షేర్ చేసింది. తొలి టెస్టు నేపథ్యంలో కెప్టెన్లు ఫోటోలు అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ ఫొటోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైట్ జెర్సీ తళుక్కున మెరుస్తుండగా.. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జెర్సీ మట్టితో కలిసి మాసినట్లు ఉంది. ఈ ఫోటోలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్స్‌తో పెడుతున్నారు. న్యూజిలాండ్ జెర్సీపై నెటిజన్లు కుళ్లు జోకులు వేస్తున్నారు.

కేన్ విలియమ్సన్ జెర్సీ, కోహ్లీ జెర్సీ రంగుల్లో తేడా ఉండంది. దీంతో నెటిజన్లు టైడ్ బట్టల సబ్బు యాడ్‌లా ఉందని ఒకరంటే.. ఉజాల వేసి ఉతకమని మరొకరు.. బ్లాక్ క్యాప్స్ జట్టు జెర్సీ మెరవాలంటే టైడ్ వాడాలని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. టైడ్ న్యూజిలాండ్‌కు స్పాన్సర్ గా చేయాలని ఛలోక్తులు వేస్తున్నారు. నిర్మా వాషింగ్ ఫౌడర్ మహిమా అంటూ సరదా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇవి పనిలేదు టీమిండియా జట్టు వైట్ వాష్ చేస్తుంది అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యామని కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. ప్రత్యర్థి జట్టులో కీలక బౌలర్లు ఫీల్డర్లు ఉన్నారు కాబట్టి వారిని సమర్థవంతంగా వారిని ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని వెల్లడించాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మైదానంలో ప్రేక్షకులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు.

ఇప్పటికే ఐదు టీ20ల్లో బ్లాక్‌క్యాప్స్‌పై 5-0తో విజయం సాధించింది. అనంతరం జరిగిన మూడు వన్డేల సిరీస్ 3-0తో కోల్పోయిన టీమిండియా మరో సమరానికి సిద్ధం కానుంది. అయితే వన్డే సిరీస్ ఘోర పరాజయం పాలైన భారత్ రెండు టెస్టుల సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళూరుతోంది. మరోవైపు కివీస్ సైతం వన్డేల్లో సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుబోతుంది.

.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories