India Vs Bangladesh : రెండో టీ20 విజయంపై బంగ్లా కన్ను

India Vs Bangladesh
x
India Vs Bangladesh
Highlights

ఇప్పటికే తొలి టీ20 గెలిచి జోరు మీదున్న బంగ్లా, కాసేపట్లో రాజ్ కోట్ లో జరిగే రెండో టీ20లో భారత్ పై మరోసారి విజయం సాధించాలని తహతహలాడుతోంది.

ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న బంగ్లాదేశ్ జట్టు గురువారం మరో సమరానికి సిద్దమైంది. సౌతాఫ్రికాతో జరగిన టెస్టు సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసి జోరు మీదున్న భారత్ కు బంగ్లా గట్టి షాక్ ఇచ్చింది. కెప్టెన్ షకీబ్ ఐసీసీ నిషేదం, ఓపెనర్ తమీమ్ వ్యక్తిగత కారణాలతో ఆడకపోవడంతో బంగ్లా జట్టుకు కుదేలైంది. అయితే ఢిల్లీలో జరిగిన మ్యాచ్ గెలిచి అందరి అంచనాలకు తలదన్నింది.

మొదటి టీ20 పరాభవంతో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో ఎలాగైనా బంగ్లాపై గెలిచితీరాలన్న కసితో ఉంది. తొలి టీ20లో బ్యాట్స్ మెన్ తడబాటుతో ,డీఆర్ఎస్ వినియోగించలేకపోయింది. ఆరంగేట్రం చేసిన శివన్ దూబే నిరాశపరిచాడు. శివన్ తో పాటు మరో ఆటగాడు రాహుల్ కు కీలక మ్యాచ్ గా చెప్పాలి. తొలి మ్యాచ్ లో విఫలమైన దూబే ఈ మ్యాచ్ అదిరిపోయే ప్రదర్శ ఇస్తాడని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. భారత జట్టు కీలక ఓపెనర్ శిఖర్ ధావన్ దూకుడుగా ఆడాల్సిన అవకాశం ఉంది. తొలి టీ20లో శిఖర్ధావన్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌ వేధికగా జరగనుంది. అయితే గుజరాత్‌లోని డయు, పోర్ బందర్ మధ్య "మహా" తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మహా తుపాను తీరం దాటే ముందు రాజ్ కోట్ సహా చూట్టు ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెండో టీ20 వర్షం ముప్పు పొంచి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories