Top
logo

92 పరుగులకే ఆల‌ౌ‌‌ట్‌ అయిన రోహిత్ సేన

92 పరుగులకే ఆల‌ౌ‌‌ట్‌ అయిన రోహిత్ సేన
X
Highlights

న్యూజిలాండ్‌ సీరిస్‌ కైవసం చేసుకుని ఊపు మీదున్న భారత జట్టు నాలుగో వన్డేలో అత్యంత చెత్త రికార్డును...

న్యూజిలాండ్‌ సీరిస్‌ కైవసం చేసుకుని ఊపు మీదున్న భారత జట్టు నాలుగో వన్డేలో అత్యంత చెత్త రికార్డును స్పష్టించింది. కెప్టెన్‌తో పాటు ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో 92 పరుగులకే భారత్ ఆల్ అవుట్ అయ్యింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెన్లర్లు బరిలోకి దిగిన రోహిత్ ఏడు పరుగులకే అవుట్ కాగా మరో ఓపెనర్‌ ధావన్ 13 పరుగులు సాధించి Lbwగా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన ఏ ఒక్కరూ రాణించకపోవడంతో 12 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయింది. చివర్లో యజేంద్ర చౌహల్ కాస్తా చెలరేగి మూడు ఫోర్లతో 18 పరుగులు సాధించాడు. భారత జట్టులో ఇదే అత్యత్తమ స్కోర్‌ కావడం విశేషం. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్ ఐదు వికెట్లు సాధించి భారత బ్యాటింగ్ లైనప్ వెన్నువిరిచాడు. ఇదే సమయంలో మరో బౌలర్ కోలీన్ మూడు కీలకమైన వికెట్లు సాధించి భారత్‌ను తక్కువ పరుగులకు కట్టడి చేశాడు.

Next Story