అండర్‌-19 ప్రపంచకప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

India advanced to the semifinals of the Under-19 World Cup
x

అండర్‌-19 ప్రపంచకప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

Highlights

Under-19 World Cup: క్వార్టర్‌ ఫైనల్‌‌లో 5 వికెట్ల తేడాతో బగ్లాదేశ్‌ను ఓడించిన యంగ్ ఇండియా, బంగ్లాదేశ్‌ను 111 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా.

Under-19 World Cup: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీస్‌కు దూసుకెళ్లింది. కీలక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌.. బంగ్లాదేశ్‌ను 111 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం బ్యాంటింగ్‌కు దిగిన భారత్.. 30.5 ఓవర్లలో 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. రఘువంశీ 44 పరుగుల, షేక్‌ రషీద్‌ 26, కెప్టెన్‌ యశ్‌ దుల్‌ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవికుమార్‌ మూడు, విక్కీ ఓస్వాల్‌ రెండు, కౌశల్‌ తంబే, రఘువన్షీ, రాజవర్దన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించిన రవికుమార్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక భారత్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories