Ind Vs Zim T20 WC Super 8: చితక్కొట్టిన టీమిండియా.. జింబాబ్వే పై ఘన విజయం

Ind Vs Zim T20 WC Super 8: జింబాబ్వే పై భారత్ 72 పరుగుల తేడాతో ఘన  విజయం సాధించింది
x

Ind Vs Zim T20 WC Super 8 

Highlights

Ind Vs Zim T20 WC Super 8: సూపర్ 8 లో జింబాబ్వే పై 72 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది

Ind Vs Zim T20 WC Super 8: 20 ప్రపంచ కప్ లో భాగంగా జరుగుతున్న 8వ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 257 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ముందు ఉంచింది. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో జింబాబ్వే పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో జింబాబ్వే సెమీ ఫైనల్ దారులు మూసుకుపోయాయి. మరోవైపు టీమిండియా సెమీస్ కు చేరడం ఖాయం అయ్యే ఛాన్స్ ఉంది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్ మెన్ సమిష్టి కృషితో భారీ స్కోరు చేయగలిగింది. వరుసగా మ్యాచుల్లో విఫలం అవుతూ వస్తున్న అభిషేక్ శర్మ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 55 రన్స్ చేశాడు. మరోవైపు హార్దిక్ పాండ్య కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 23 బంతుల్లోనే హార్దిక్ 50 పరుగులు చేశాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ 44 పరుగులతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకు పడ్డాడు. సంజూ సంశన్ అవుట్ అయ్యాకా వచ్చిన ఇషాన్ కిషన్ కూడా కీలకమైన 38 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లోనే 33 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మొత్తంగా చూసుకుంటే, భారత బ్యాటర్లు ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు చేసి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 256 పరుగులు చేయగలిగింది.

భారత్ చేసిన 256 పరుగులు T20 ప్రపంచ కప్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260 పరుగుల అత్యధిక స్కోరుగా ఉంది.

అదేవిధంగా టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తన అత్యధిక స్కోరును నమోదు చేసింది. మునుపటి రికార్డు 2007లో ఇంగ్లాండ్‌పై నమోదైన 218. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు.

Ind Vs Zim T20 WC Super 8: తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టు ఏ దశలోనూ విజయం సాధించే విధంగా కనిపించలేదు. మొదట్లో వికెట్లు పాడకపోయినా మెల్లగా స్కోరు చేస్తూ వచ్చారు. పవర్ ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ నాటౌట్ గా నిలిచారు.

పవర్ ప్లే చివరి ఓవర్లో తడివానాషే మరుమాని క్యాచ్ ను రింకు సింగ్ జారవిడిచాడు. ఆ తరువాతగా అక్షర్ పటేల్ తన మొదటి ఓవర్లోనే భారత్ కు వికెట్ ఇచ్చాడు. రెండో బంతికి కవర్ పాయింట్ వద్ద ఇషాన్ కిషన్ బౌలింగ్ లో తడివానాషే మరుమాని క్యాచ్ ఇచ్చాడు. మరుమాని 20 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Ind Vs Zim T20 WC Super 8: ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన రాజా బ్రియాన్ బెన్నెట్ తో కలిసి జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు ఈ క్రమంలో బెన్నెట్ 13వ ఓవర్లో అర్ధ సెంచరీ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ రెండో బంతికి సిక్స్ కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

మొత్తమ్మీద 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసిన జింబాబ్వే టీమిండియాపై 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories