ICC T20 World Cup : టీమిండియా జైత్రయాత్ర.. మిగిలింది రెండే అడుగులు

ICC T20 World Cup :  టీమిండియా జైత్రయాత్ర.. మిగిలింది రెండే అడుగులు
x
Image by Star Sports
Highlights

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన 114 పరుగుల...

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ లీగ్ దశలో ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం సాధించింది. శ్రీలంక నిర్ధేశించిన 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌, మరో 5.2 ఓవర్లు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. గ్రూప్ -ఏ నాలుగు వరుస విజయాలు నెలకొల్పి రికార్డు సృష్టించింది. డాషింగ్ ఓపెనర్ , హిట్టర్ షెఫాలీ వర్మ(47, 34 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సు)మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. షెఫాలీ వర్మ అర్థశతకానికి చేరువలో ఉండగా.. భారీ షాట్‌కు యత్నించి ఔటైంది. జెమిమా రోడ్రిగ్స్(15) దీప్తి శర్మ(15) నాటౌట్‌గా నిలిచారు.శ్రీలంక బౌలర్లలో శశికళ మూడు వికెట్లు దక్కించుకుంది.

అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(15), ఓపెనర్ స్మృతి మంధాన(17) పరుగులతో రాణించారు. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్ గత నాలుగు మ్యాచ్ లో తక్కువ స్కోరుకే పరిమితమవుతూ విఫలమవుతున్నారు. ఈ మ్యాచ్ లో సైతం అదే ఆటతీరును కనబరిచారు. షెఫాలీ వర్మ ధాటిగా ఆడటంతో మ్యాచ్ తొలి పది ఓవర్లలోనే భారత్ వైపు మళ్లింది. భారత్‌ ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తన సెమీస్ మార్చి 5 గురువారం గ్రూప్ బిలో రెండోస్థానంలో నిలిచిన జట్టుతో ఆడనుంది.

అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను ఫీల్గింగ్‌కు ఆహ్వానించింది. రాధాయాదవ్ ధాటికీ శ్రీలంక బ్యాట్స్ఉమెన్ కీలక వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్‌ ఆటపట్టు (33 పరుగలు, 24బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. విగతా బ్యాట్స్ఉమెన్ హాసిని(7), కరుణరత్నె (7), అనుష్క(1) నీలాక్షి డి సిల్వా(8) విఫలమైయ్యారు. హర్షిత(12), శశికల (13) డుబుల్ డిజిట్ స్కోరు చేయగా.. ఆఖర్లో టేలండర్ కవిశా దిల్హారి(25,16 బంతుల్లో, 2 ఫోర్లు) రాణించింది. దీంతో శ్రీలంక తొమ్మిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధాయాదవ్ 23 పరుగులకే నాలుగు వికెట్ల తీసి సత్తాచాటింది. గౌక్వాడ్ రెండు వికెట్లతో రాణించగా.. దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌, శిఖ పాండే తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories