
IND vs SA: ఏడు ఇన్నింగ్స్‌లలో ఐదు డకౌట్లు.. టీమిండియాకు బిగ్ టెన్షన్, ఇక అతడే దిక్కా!
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత జట్టు సూపర్-8కు చేరుకుంది. లీగ్ దశలో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది.
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత జట్టు సూపర్-8కు చేరుకుంది. లీగ్ దశలో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. అమెరికా, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్‌పై సూర్య సేన అద్భుత విజయాలు అందుకుని.. సూపర్-8 పోరుకు సిద్దమైంది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్నా.. టీమ్ మేనేజ్‌మెంట్‌ను మాత్రం యువ ఓపెనర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ కలవరపెడుతోంది.
అభిషేక్ శర్మ టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లలో 0(1), 0(4), 0(3) స్కోర్లు చేశాడు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్లు అవడం జట్టు టాప్ ఆర్డర్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దూకుడుగా ఆడే అభిషేక్ తన సహజ శైలిలో ప్రతి బంతినీ సిక్సర్‌కు ప్రయత్నించడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఏడు టీ20 ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే.. అతడి ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. ఏడు ఇన్నింగ్స్‌లలో వరుసగా 0(1), 68(20), 0(1), 30(16), 0(1), 0(4), 0(3) స్కోర్స్ చేశాడు. ఈ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు డకౌట్లు ఉండడంతో అభిషేక్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి.
అభిషేక్ శర్మ గత ఏడు ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక్క బిగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా మ్యాచ్‌ల్లో నిలకడ లేకపోవడం జట్టుకు సమస్యగా మారింది. అభిషేక్ మొదటి 5–10 బంతులు ఆడిన తర్వాత దూకుడుగా ఆడితే మంచి ఫలితాలు రావచ్చని మాజీలు సూచిస్తున్నారు. బ్యాకప్ ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ కూడా అంతగా లేకపోవడం జట్టుకు మరో సమస్య. అభిషేక్ ఫామ్‌లో లేకపోవడంతో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై భారం పడుతోంది. మొదటి స్థానంలో వచ్చే తిలక్ వర్మ కూడా దూకుడుగా ఆడడం లేదు. దాంతో టాప్ ఆర్డర్ భారం కిషన్ మోస్తున్నాడు. ఇప్పుడు జట్టుకు దిక్కు కిషనే. ఒకవేళ అభిషేక్ త్వరగా ఫామ్‌లోకి రాకపోతే.. సూపర్-8 వంటి కీలక దశల్లో భారత్‌కు ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే జట్టు విజయాలు సాధిస్తున్నప్పటికీ.. టాప్ ఆర్డర్ స్థిరత్వం కీలకంగా మారింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ త్వరగా ఫామ్ అందుకుంటే టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరింత బలపడుతుంది. లేదంటే బిగ్ మ్యాచ్‌ల్లో ఈ బలహీనత ప్రత్యర్థులకు అవకాశం కల్పించవచ్చు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్లుతో పాటు సంచలన విజయాలు సాదించిన జింబాబ్వేతో టీమిండియా మ్యాచులు ఆడాల్సి ఉంది. సరైన ఆరంభం దక్కితే.. జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి సూపర్-8లో అయినా అభిషేక్ ఫామ్ అందుకుంటాడో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




