Ind vs SA 3rd Test : క్లీన్ స్వీప్‌కి రెండు వికెట్ల దూరంలో టీమిండియా!

Ind vs SA 3rd Test : క్లీన్ స్వీప్‌కి రెండు వికెట్ల దూరంలో టీమిండియా!
x
Highlights

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టెస్ట్ మూడో రోజు ముగిసింది. భారత్ బౌలర్ల ధాటికి సఫారీ జట్టు వికెట్లు పేకమేడలా కూలాయి. టీమిండియా విజయానికి మరో రెండు వికెట్లు మాత్రమే విగిలి ఉన్నాయి.

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టెస్ట్ మూడో రోజు ముగిసింది. భారత్ బౌలర్ల ధాటికి సఫారీ జట్టు వికెట్లు పేకమేడలా కూలాయి. టీమిండియా విజయానికి మరో రెండు వికెట్లు మాత్రమే విగిలి ఉన్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడుతున్న సౌతాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. భారత్ జట్టు బౌలర్లు షమి 3 వికెట్లు తీసుకున్నాడు. ఉమేష్ 2, జాడేజా, అశ్విన్ చెరో వికెట్ పడకొట్టారు.

అంతకు ముందు మూడో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోరు 9/2తో తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంబించిన దక్షిణాఫ్రికా 162 పరుగులకి ఆలౌటైంది. దీంతోభారత్ జట్టుకు తొలి ఇన్నింగ్స్ 335 ఆధిక్యం లభించింది. సఫారీ ప్లేయర్లు హజ్మా 79 బంతుల్లో 62పరుగులు చేశాడు. జార్జ్ లిండే 37 పరుగులు చేశాడు, బవుమా 32 పరుగులు చేసి భారత్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. నదీమ్, జడేజా, షమీ తలో రెండేసి వికెట్లు తీశారు.

మరో రెండు రోజులు సమయం ఉండటంతో టీమిండియా గెలుపునకు 2 వికెట్లు కావాలి. దక్షిణాఫ్రికా ఇంకా 214 పరుగులు వెనుకబడి ఉంది. ఇప్పటికే సిరీస్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు గెలిచిన భారత్ చివరిదైన మూడో టెస్టులోనూ ఘనం విజయం దిశగా పయనిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories