India vs South Africa: రెండో టెస్టులోనూ భారత్‌దే ఆధిపత్యం

India vs South Africa:  రెండో టెస్టులోనూ భారత్‌దే ఆధిపత్యం
x
Highlights

మొదటి రోజు ఆట ముగిసే సయయానికి భారత్ 3వికెట్లుకు 273 పరుగులు సాధించింది. కోహ్లీ 63 పరుగులతో, రహానే 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రాబడ మూడు వికెట్లు తీసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ శతకంతో విజృంభించాడు. మొదటి రోజు ఆట ముగిసే సయయానికి భారత్ 3వికెట్లుకు 273 పరుగులు సాధించింది. కోహ్లీ 63 పరుగులతో, రహానే 18 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రాబడ మూడు వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు ఆరంభంలో నిరాశ ఎదురైంది. ఓపెనర్ గా విశాఖ టెస్టులో బరిలోకి దిగిన రోహిత్ 14 పరుగులు చేసి రాబడ బౌలింగ్ లో ఔటయ్యాడు. జట్టు 25 పరుగులకే తొలి వికెట్ కోల్పొయింది. ఈ నేపథ్యంలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కు పూజారా జతకలవడంతో భారీ స్కోరు దిశగా సాగింది. 58 పరుగులు చేసిన పుజారా జట్టు స్కొరు 163 పరుగులు వద్ద అవుటైయ్యాడు. ఈ నేపథ్యంలో స్కోరు మందగించింది. అయితే మయాంక్ భరీలో ఉన్నాడు. మయాంక్ 108 (16x4,2x6) పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మయాంక్ అవుట్ అవ్వడంతో భారత్ స్కొర్ నెమ్మదించింది. మొత్తానికి మొదటి రోజు భారత్ తన ఆదిపత్యం కోనసాగించింది. ఇప్పటికే టీమిండియా మొదటి టెస్టు గెలిచి 1-0తో ఆధిక్యంలో దుసుకె‌ళ్తోంది

Show Full Article
Print Article
More On
Next Story
More Stories