
IND vs PAK: ఆశ్చర్యపరుస్తున్న కొలంబో పిచ్ గణాంకాలు.. పాక్ కెప్టెన్ వ్యూహాత్మక నిర్ణయం!
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మెగా టోర్నీలో ఇప్పటివరకు కొలంబోలో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌లలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 171గా నమోదైంది. అయినా కూడా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అలీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే టీ20 ప్రపంచకప్ 2026కి ముందు కొలంబోలో జరిగిన ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రం పూర్తిగా విరుద్ధ ఫలితాలు వచ్చాయి. ఆ మ్యాచ్‌లన్నింటిలోనూ లక్ష్య ఛేదనకు దిగిన జట్లే విజయం సాధించాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు కేవలం 127 మాత్రమే ఉండటం గమనార్హం. ఇక భారత్–పాకిస్థాన్ మధ్య 2014 తర్వాత జరిగిన 11 టీ20 మ్యాచ్‌లలో 10 సార్లు చేజింగ్ జట్టే గెలిచింది. ఒక్కసారి మాత్రమే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ విజయం సాధించింది. అది కూడా టీ20 ప్రపంచకప్ 2024లో నమోదయింది. న్యూయార్క్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.
మొత్తంగా గణాంకాలు చేజింగ్ జట్లకు అనుకూలంగా ఉన్నాయి. అందుకేనేమో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో అమెరికాపై విజయం సాధించిన తర్వాత సల్మాన్ అఘా మాట్లాడుతూ.. తమ జట్టు సాధారణంగా ముందుగా పరుగులు చేసి, ఆపై అద్భుత బౌలింగ్‌తో విజయం సాదించేందుకు ఇష్టపడుతుందని చెప్పాడు. ప్రపంచానికి భిన్నంగా ఆలోచిస్తామని కూడా పేర్కొన్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహం మార్చినట్లు స్పష్టమైంది. 2021 తర్వాత కొలంబోలో జరిగిన 13 మ్యాచ్‌లలో 10 సార్లు చేజింగ్ జట్టే గెలిచిన రికార్డు ఉండటంతో పాక్ నిర్ణయం వ్యూహాత్మకం అనే చెప్పాలి.
మరోవైపు భారత్, పాకిస్థాన్ కెప్టెన్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగకపోవడం కూడా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద గణాంకాలు, పరిస్థితులు, వ్యూహాలు.. అన్ని కలిసిన ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 రన్స్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




