IND vs NZ Match: ఫుల్ జోష్ మీదున్న కుల్దీప్ యాదవ్.. వరుసగా రెండు వికెట్స్

IND vs NZ score live updates from Champions Trophy 2025 Final: Kuldeep Yadav sends Williamson, Rachin Ravindra
x

IND vs NZ Match: ఫుల్ జోష్ మీదున్న కుల్దీప్ యాదవ్.. వరుసగా రెండు వికెట్స్

Highlights

IND vs NZ score updates from Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫుల్ జోష్...

IND vs NZ score updates from Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫుల్ జోష్ మీదున్నాడు. 11వ ఓవర్‌లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్రను ఔట్ చేసిన కుల్దీప్ యాదవ్ ఆ తరువాత వెంటనే మరో ఓవర్‌లో కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో న్యూజిలాండ్ 12.2 ఓవర్లలో 75 పరుగుల స్కోర్ వద్ద 3 వికెట్లు కోల్పోయింది.

రచిన్ రవీంద్రను 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ చేసిన కుల్దీప్ కేన్ విలియమ్సన్‌ను 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టించాడు.

అంతకంటే ముందుగా విల్ యంగ్‌ను 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. అప్పటికి కివీస్ స్టోర్ 8 ఓవర్లలో 58 పరుగుల వద్ద ఉంది.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కేప్టేన్ మిచెల్ శాంటర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టీమిండియా కేప్టేన్ రోహిత్ శర్మ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 12వ సారి. భారత్ వరుసగా టాస్ ఓడిపోవడం ఇది 15వ సారి.

ఒకసారి చరిత్రను తిరగేస్తే ఐసిసి టోర్నమెంట్స్‌లో ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌పై ఇండియా విజయం సాధించిన దాఖలాలు లేవు. కానీ ఈసారి ఎలాగైనా ఫైనల్స్‌లో కివీస్‌పై విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సొంతం చేసుకోవాలని టీమిండియా కసి మీద ఉంది. రోహిత్ శర్మ కెరీర్‌కు సైతం ఈ విజయం కీలకం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories