టీమిండియా కివీస్ మూడు వన్డేల షెడ్యూల్ ఇదే.. రోహిత్ డౌట్ ..?

టీమిండియా కివీస్ మూడు వన్డేల షెడ్యూల్ ఇదే.. రోహిత్ డౌట్ ..?
x
రోహిత్ శర్మ ఫైల్ ఫోటో
Highlights

టీమిండియా కివీస్ ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ముగిసింది. ఐదు టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసి బ్లాక్‌క్యాప్స్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే.

టీమిండియా కివీస్ ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఐదు టీ20ల సిరీస్ ముగిసింది. ఐదు టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసి బ్లాక్‌క్యాప్స్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. అయితే ఇరు జట్ల మధ్య 50 ఓవర్ల ఫ్లార్మాట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే మూడు వన్డేలకు జట్టును, అటు బీసీసీఐ, ఇటు కివీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నె 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే మొదలవుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది.

అనంతరం టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 14 నుంచి 16 వరకూ హామిల్టన్ వేదికగా 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 21 నుంచి 25 వరకూ వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఇక ఫిబ్రవరి 29 నుంచి మార్చి 4 వరకూ క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు జరుగుతుంది. దీనితో కివీస్ టూర్ ని కంప్లీట్ చేసుకొని జట్టు భారత్ కి చేరుకుంటుంది.

భారత కాలమాన ప్రకారం వన్డే మ్యాచ్‌లు ఉదయం 7.30 గంటలు మొదలుకానున్నాయి. ఇక టెస్ట్ మ్యాచ్‌లు ఉదయం 4 గంటలకి మొదలవుతాయి. అయితే న్యూజిలాండ్ పై జరిగిన ఐదో టీ20ల్లో గాయపడిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆడటం అనుమానమే. వన్డే సిరీస్ ప్రారంభానికి మరో మూడు రోజులు సమయం ఉండడంతో రోహిత్ కోలుకుంటాడని టీం మేనిజిమెంట్ భావిస్తోంది. ఐదో టీ20లో రోహిత్ 41 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సులతో 60 పరుగులు చేసి పిక్క పట్టేయడంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ వన్డే సిరీస్ లోగా కోలుకోవాలని టీమిండియా అభిమానలు కోరుకుంటున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్ ముందు గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తప్పుకున్న సంగతి తెలిసిందే.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories