India Vs New Zealand: రేపు ఇండియా,న్యూజిలాండ్ మధ్య రెండవ టీ20

India Vs New Zealand: రేపు ఇండియా,న్యూజిలాండ్ మధ్య రెండవ టీ20
x
Highlights

టీమిండియా న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే భారత్ 1-0తో ముందంజలో ఉంది.

టీమిండియా న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే భారత్ 1-0తో ముందంజలో ఉంది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్ధేశించిన 204 విజయ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజలో కొనసాగుతుంది. కాగా.. కివీస్ పై ఆక్లాండ్ వేదికగా ఆదివారం రెండో టీ20 జరగనుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి టీమిండియా ఆత్మవిశాస్వంతో ఉంది. సొంత గడ్డ భారత్ జట్టుతో జరిగిన తొలి టీ20 భారీ స్కోరు చేసి కూడా ఓడిపోడంతో నిరుత్సాహంతో ఉంది. రెండో టీ20లో భారత్ పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ను ఇరు జట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

టీమిండియా విషయానికి వస్తే తొలి మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ నిరాశపరిచినా.. ఆస్ట్రేలియా సిరీస్ లో మూడో , నాలుగో బ్యాట్స్ మెన్ గా వచ్చిన రాహుల్.. రెగ్యులర్ ఓపెనర్ ధావన్ గాయం కారణంగా మ్యాచ్ దూరం కావడంతో ఓపెనర్ బరిలోకి దిగాడు. రాహుల్ ఆదే ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం రాణిస్తున్నాడు. శ్రేయస్స్ అయ్యారు భీరక ఫామ్ లో ఉన్నాడు. గత సిరీస్ లో రిజర్వ్ బెంచ్ కి పరిమితం అయినా శివమ్ దూబే.. కివీస్ మ్యాచ్ లో పునరాగమనం చేశాడు. ఈ మ్యాచ్ స్పల్ప స్కోరు చేసినా పూర్తి స్థాయిలో రాణించాల్సిన అవసరం ఉంది. సిరీస్‌లో రికార్డుల రారాజు టీమిండియా సారథి విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. టీ20ల్లో ఏడు సిక్సర్లు కొడితే విరాట్ కోహ్లీ 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు.

భారత బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉన్నాప్పటికి బౌలింగ్ విషంలో మాత్రం సతమతమవుతోంది. సీనియర్ బౌలర్ షమీ ధారళంగా పరుగులు ఇవ్వడం కలవరపెడుతోంది. బుమ్రా రాణిస్తున్నాప్పటికి వికెట్లు తీయడంతో విఫలమవుతున్నాడు. ఇక యువ బౌలర్లు సొంత గడ్డపై అద్భుత ఫామ్ కొనసాగించి కివీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో చేతులు ఎత్తేశారు. తర్వాత మ్యాచ్ లో బౌలింగ్ లో రాణించి పరుగులు కట్టడి చేస్తే టీమిండియాను ఆపడం కష్టం.

టీ20ల్లో నెం.1 ఛాన్స్ కొట్టేసిన పాకిస్థాన్ ఇక టీ20ల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 8,795 పరుగులు చేశాడు. మరో 160 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన టీమిండియా ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ మ్యాచ్ లో 9వేల పరుగులు సాధించిన ఆరో ప్లేయర్ గా కోహ్లీ నిలుస్తాడు. టీ20ల్లో టీమిండియా ఓపెనర్ కేఎల్. రాహుల్ 44.17 యవరేజ్ 1,237 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్థశతకాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు ఓపెనర్ బాబర్ ఆజమ్ 50.51 స్ట్రైక్ రేటుతో 1,364 పరుగులు సాధించాడు. . కివీస్ సినీయర్ బౌలర్ టీమ్ సౌతీ 75 వికెట్లు ఉన్నాయి.

కివీస్ విషయానికి వస్తే కెప్టెన్ విలియమ్స్, టేలర్, టీమ్ సౌథి, అందరూ కలిసి కట్టుగా రాణిస్తున్నారు. కివీస్ మైదానాలు బ్యాటింగ్ అనుకులంగా ఉండడంతో భారీ స్కోర్ సాధ్యమవుతుంది. బౌలింగ్ విషయం చూస్తే కివీస్ స్పిన్నర్ మిషెల్ సాంట్నర్‌ 50 వికెట్ల మైలురాయిని చేరాడు. ప్రస్తుతం కివీస్ స్పిన్నర్ మిషెల్ సాంట్నర్‌ ఖాతాలో 50 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇష్ సోధీ 48 వికెట్లుతో 50 వికెట్ల మైలురాయిని చేరేందుకు మరో రెండు వికెట్లు కావాలి. అయితే భారత్ పై సౌథీ గత రికార్డు ఘనంగా ఉంది. తొలి మ్యాచ్ లో అతను నిరాశపరిచాడు. టీమిండియా పై అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా సౌతీ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌ జట్లుపై కూడా టీమిండియా రికార్డు దారుణంగా ఉంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై భారత్ 11 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఏనిమిది మ్యాచ్ ల్లో దారుణంగా ఓడిపోయింది. అయితే 2017లో భారత్ లో పర్యటించిన కివీస్ జట్టుపై రెండు మ్యాచ్‌లలో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచ్ ల్లో ఈ ఒక్క సిరీస్ మాత్రమే భారత్ గెలిచింది. వన్డే వరల్డ్ గప్ లో సైతం న్యూజిలాండ్ జట్టుపై ఓడిపోవడం కలవర పెట్టిన అంశమే.

పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కు అనుకులంగా ఉంటుంది. గత మ్యాచ్ లో ఇదే పిచ్ పై పరుగులు వరద పారించారు.

జట్ల అంచనా:

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, శ్రేయస్స్ అయ్యార్, శివమ్ దూబే, మనీష్ పాండే, జడేజా, శార్థుల్ ఠాకుర్, మహ్మాద్ షమీ, బూమ్రా, చాహల్,/ సంజూ శాంసన్, షైనీ

న్యూజిలాండ్: విలియమ్స్ ( కెప్టెన్ ), గుప్తిల్, మున్రో , టేలర్, సైఫెర్ట్‌, గ్రాండ్‌హోమ్‌/డారిల్‌ మిషెల్‌, శాంట్నర్‌, సోధి, సౌతీ, కుగ్‌లిన్‌, బెనెట్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories