IND vs NZ 2nd ODI: రాణిస్తోన్న కివీస్ బ్యాట్స్‌మెన్

IND vs NZ 2nd ODI: రాణిస్తోన్న కివీస్ బ్యాట్స్‌మెన్
x
India Vs NZ
Highlights

అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ ఓపెనర్ గుప్తిల్(79) అర్థసెంచరీతో రాణించాడు.

అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ ఓపెనర్ గుప్తిల్(79) అర్థసెంచరీతో రాణించాడు. మరో ఓపెనర్ నికోలస్ 41 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇద్దరు కలిసి కివీస్‌కు శుభారంభాన్నించారు. తొలి వికెట్‌కు 93 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశారు. 17 ఓవర్ బౌలింగ్ వచ్చిన చాహల్ వీరి జోడిని వీడతీశాడు. అర్థసెంచరీతో తర్వాత ధాటిగా ఆడుతున్న గుప్తిల్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ మూడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. తొలి వన్డే సెంచరీ హీరో రాస్ టేలర్ (13), కెప్టెన్ టామ్ లాథమ్ (5) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో శార్థుల్, చాహల్ చెరో వికెట్ పడగొట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories