IND vs NZ 2nd ODI: ధాటిగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు

IND vs NZ 2nd ODI: ధాటిగా ఆడుతున్న కివీస్ ఓపెనర్లు
x
IND vs NZ
Highlights

అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ ఓపెనర్లు రాణింస్తున్నారు. తొలి పది ఓవర్లలో 52 పరుగులు చేసి ఆ జట్టుకు శుభారాన్నిచ్చారు. ఓపెనర్లు...

అక్లాండ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ ఓపెనర్లు రాణింస్తున్నారు. తొలి పది ఓవర్లలో 52 పరుగులు చేసి ఆ జట్టుకు శుభారాన్నిచ్చారు. ఓపెనర్లు గుప్తిల్ 29 పరుగులు, నికోలాస్ 21 పరుగులతో కొనసాగుతున్నారు. 10 ఓవర్లు మురిసే సమయానికి న్యూజిలాండ్ 52 పరుగులు చేసింది. మొదట టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్ చెప్పాడు. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో స్పిన్నర్‌ చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అక్లాండ్ మైదానంలో రెండోసారి బ్యాటింగ్‌ చేసే జట్టుకే విజయావకాశాలు ఉండటంతో కోహ్లీ ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపాడు. సిరీస్ రేసులో నిలవాలంటే మ్యాచ్‌లో భారత్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. దీంతో తాడోపేడో టీమిండియా తేల్చుకునేందుకు సిద్ధమైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories