
వరుస సిరీస్ విజయాలతో ఉన్న టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ద కానుంది. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో దైపాక్షిక సిరీస్‌కు సన్నద్ధం కానుంది.
వరుస సిరీస్ విజయాలతో ఉన్న టీమిండియా మరో రసవత్తర పోరుకు సిద్ద కానుంది. ఈ ఏడాది తొలి విదేశీ పర్యటనలో భాగంగా శుక్రవారం నుంచి న్యూజిలాండ్‌తో దైపాక్షిక సిరీస్‌కు సన్నద్ధం కానుంది. 24 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20ల మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ ఇరు జట్ల మధ్య గత రికార్డులను పరిశీలిద్దాం.
టీ20ల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా రికార్డు పేలవంగా ఉందనే చెప్పాలి. న్యూజిలాండ్ గడ్డపై ఆడిన ఐదు టీ20ల్లో భారత్ కేవలం ఒకే ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. 2019 జనవరిలో జరిగిన పర్యటనలో సిరీస్ కోల్పోయింది. తాజాగా మళ్లి జనవరిలో సిరీస్ ప్రారంభం కావడం గమనార్హం. ఆక్లాండ్‌లో జరిగిన ఒకే మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
న్యూజిలాండ్ జట్లుపై కూడా టీమిండియా రికార్డు దారుణంగా ఉంది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై భారత్ 11 మ్యాచ్‌లు ఆడగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఏనిమిది మ్యాచ్ ల్లో దారుణంగా ఓడిపోయింది. అయితే 2017లో భారత్ లో పర్యటించిన కివీస్ జట్టుపై రెండు మ్యాచ్‌లలో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై ఆడిన మ్యాచ్ ల్లో ఈ ఒక్క సిరీస్ మాత్రమే భారత్ గెలిచింది. వన్డే వరల్డ్ గప్ లో సైతం న్యూజిలాండ్ జట్టుపై ఓడిపోవడం కలవర పెట్టిన అంశమే.
ఇక టీ20ల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ 8,795 పరుగులు చేశాడు. మరో 205 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్లో 9వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. దీంతో ఈ ఘనత సాధించిన టీమిండియా ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేస్తాడు. టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ మ్యాచ్ లో 9వేల పరుగులు సాధించిన ఆరో ప్లేయర్ గా కోహ్లీ నిలుస్తాడు.
టీ20ల్లో టీమిండియా ఓపెనర్ కేఎల్. రాహుల్ 44.17 యవరేజ్ 1,237 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 9 అర్థశతకాలు ఉన్నాయి. పాకిస్థాన్‌కు ఓపెనర్ బాబర్ ఆజమ్ 50.51 స్ట్రైక్ రేటుతో 1,364 పరుగులు సాధించాడు.
బౌలింగ్ విషయం చూస్తే కివీస్ స్పిన్నర్ మిషెల్ సాంట్నర్ 50 వికెట్ల మైలురాయిని చేరేందుకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కివీస్ స్పిన్నర్ మిషెల్ సాంట్నర్ ఖాతాలో 49 వికెట్లు ఉన్నాయి. ఇష్ సోధీ 47 వికెట్లుతో 50 వికెట్ల మైలురాయిని చేరేందుకు మరో మూడు వికెట్లు కావాలి. కివీస్ సినీయర్ బౌలర్ టీమ్ సౌతీ 75 వికెట్లు ఉన్నాయి. అయితే భారత్ పై సౌథీ రికార్డు ఘనంగా ఉంది. టీమిండియా పై అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా సౌతీ రికార్డు నెలకొల్పాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




