IND vs NZ Final: ఫైనల్ కు ముందు తీవ్ర ఆందోళనలో టీం ఇండియా.. విరాట్ ఆడడం డౌటే

IND vs NZ Final: ఫైనల్ కు ముందు తీవ్ర ఆందోళనలో టీం ఇండియా.. విరాట్ ఆడడం డౌటే
x

IND vs NZ Final: ఫైనల్ కు ముందు తీవ్ర ఆందోళనలో టీం ఇండియా.. విరాట్ ఆడడం డౌటే

Highlights

IND vs NZ Final: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9 ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. రెండు జట్లు విజయం పై ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాయి.

IND vs NZ Final: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చి 9 ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. రెండు జట్లు విజయం పై ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నాయి. దీనికి ముందు భారత జట్టు కాస్త ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్ ఆడడం కాస్త డౌటే అనిపిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు టీం ఇండియా ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ గాయపడ్డాడని ఒక నివేదిక పేర్కొంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కోహ్లీకి గాయమైంది. ఆ తర్వాత అతను ప్రాక్టీస్ ఆపేశారు. వైద్య బృందం అతడిని పరీక్షించడం ప్రారంభించింది.

ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ సమయంలో విరాట్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటుండగా ఒక బంతి అతని మోకాలికి తగిలిందని పాకిస్తాన్ మీడియాలో వచ్చిన ఒక నివేదిక పేర్కొంది. దీని తరువాత అతను బ్యాటింగ్ ఆపేశాడు. భారత జట్టు ఫిజియో అతనిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. దీని తర్వాత కోహ్లీ ప్రాక్టీస్ చేయలేదు కానీ ఈ సమయంలో అతను ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను చూస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రాక్టీస్ చేయకపోతే తను జట్టుతోనే ఉన్నాడు.

విరాట్ ఫిట్‌నెస్ ఇటీవలి కాలంలో టీం ఇండియాకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇటీవల మోకాలి గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో అతను ఆడలేకపోయాడు. తాజా గాయం టీం ఇండియా, అతడి అభిమానులను కలవర పెడుతుంది.కాకపోతే కోహ్లీకి అయిన గాయం అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది.భారత జట్టు సహాయక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కోహ్లీ ఫైనల్‌కు ఫిట్‌గా ఉన్నాడని.. ఫైనల్ మ్యాచ్ ఆడుతాడని తెలుస్తోంది.

టీం ఇండియా టైటిల్ గెలవాలంటే విరాట్ కోహ్లీ ఫిట్ గా ఉండి మైదానంలోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు విరాట్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తను టీం ఇండియా తరఫున అత్యధిక పరుగులు చేశారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ 100పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో కూడా కోహ్లీ అద్భుతమైన 84 పరుగులు చేసి టీమ్ ఇండియాకు ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఈ టోర్నమెంట్‌లో కోహ్లీ ఇప్పటివరకు 4 ఇన్నింగ్స్‌లలో 217 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories