IND Vs NZ Test : టీమిండియా జట్టులో మార్పులు.. తెలుగు క్రికెటర్‌కు అవకాశం?

IND Vs NZ Test : టీమిండియా జట్టులో మార్పులు.. తెలుగు క్రికెటర్‌కు అవకాశం?
x
Highlights

న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఐదు టీ20ల్లో బ్లాక్‌క్యాప్స్‌పై 5-0తో విజయం సాధించింది. అనంతరం జరిగిన మూడు వన్డేల సిరీస్ 3-0తో కోల్పోయిన టీమిండియా మరో సమరానికి సిద్ధం కానుంది. అయితే వన్డే సిరీస్ ఘోర పరాజయం పాలైన భారత్ రెండు టెస్టుల సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళూరుతోంది. మరోవైపు కివీస్ సైతం వన్డేల్లో సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుబోతుంది.

న్యూజిలాండ్ సిరీస్ ముందు టీమిండియా ఓపెనర్ ధావన్ గాయం కారణంగా నిష్ర్రమించిన సంగతి తెలిసిందే. ఆఖరి టీ20ల్లో కాళ్ల కండరాళ్ల గాయంతో రోహిత్ తప్పకున్నాడు. దీంతో టీమిండియాకు పెద్ద షాక్ తప్పలేదు. అయితే వన్డేల్లో కుర్రాళ్లను తీసుకున్న భారత్ గత కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్న రాహుల్‌ను నాలుగో స్థానానికి పంపించింది. ఓపెనర్లుగా అవతారం ఎత్తిన పృధ్వీషా, మయాంక్ అగర్వాల్ మూడు వన్డేల్లో నిరాశపరిచారు. తొలి వికెట్ కు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమైయ్యారు. దీంతో టీమిండియాకు ఓపెనర్ల ఎవరిని పంపాలనేది పెద్ద సవాల్‌గా మారింది. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ పంపించినా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ కూడా పేలవ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు.

మరోవైపు టీ20ల్లో రాణించిన టీమిండియా బౌలర్లు, వన్డేల్లో తేలిపోయారు. సినీయర్ బౌలర్ షమీకి విశ్రాంతినిచ్చినా.. షైనీ, ఠాకూర్, బుమ్రా దారుణంగా విఫలమైయ్యారు. కాగా.. టెస్టు సిరీస్ కు ముందు జరిగిన సన్నాహాక మ్యాచ్‌లో భారత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఓపెనర్ మయాంక్ తో పాటు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ తెలుగు క్రికెటర్ హను విహారీ సెంచరీతో సత్తాచాటాడు.

ఇక నయా వాల్ పుజారా కూడా ఫామ్‌లో ఉండటంతో భారత్‌కు కలిసోచ్చే అంశం. అయినప్పటీకీ తుది జట్టులోనూ కోన్ని మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

గత సంవత్సరం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో ఓపెనర్‌గా చోటు దక్కించుకోలేకపోయిన తెలుగు క్రికెటర్ హనుమ విహారి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెరుపు శతకంతో మళ్లీ ఫామ్ అందుకున్నాడు. 2019 వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచుల్లో సెంచరీ బాదిన హనుమ విహారికి తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. కానీ..ఈ సారి టీమిండియా తొలి టెస్టులో అదనపు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగాలని ఆశిస్తుండటంతో విహారికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా అవకాశం దక్కించుకున్న నిరాశపరిచాడు. టెస్టుల్లో పంత్‌ని పక్కన పెడుతున్న భారత్ సాహాకి వరుసగా అవకాశాలిస్తోంది. కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం సాహా రాణించాల్సి ఉంది. టాప్ ఆర్డర్ బలంగా ఉన్న టీమిండియా.. సాహా బ్యాటింగ్‌పై ఆందోళన చెందడం లేదు.

తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి అవకాశం దక్కనుంది. వన్డే సిరీస్‌లో లోయర్ ఆర్డర్‌లో ఒత్తిడి లేకుండా ఇన్నింగ్స్‌లు ఆడిన జడేజా బౌలింగ్‌లోనూ రాణించాడు. టెస్టుల్లో టాప్ ర్యాంకుల్లో ఉన్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిజర్వ్ బెంచ్‌కి పరిమితమం చేసే అవకాశం ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా అంచనాల్ని అందుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో అతను లయ అందుకుంటాడని టీమిండియా ధీమా వ్యక్తం చేస్తోంది. షమీ తర్వాత టెస్టుల్లో మాత్రం ఉమేశ్ యాదవ్ చోటు నిలబెట్టుకుంటున్నాడు. ఈ పేసర్ ఇటీవల దేశవాళీలోనూ ఆడిన మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories