రిషబ్ పంత్‌ని తప్పించిన భారత్..పంత్ స్థానంలో ఆంధ్రా కీపర్

రిషబ్ పంత్‌ని తప్పించిన భారత్..పంత్ స్థానంలో ఆంధ్రా కీపర్
x
శ్రీకర్
Highlights

విండీస్ తో జరిగే టీ20లు, వన్డే సిరీస్ జట్టుకు టీమిండియా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే రిషబ్ పంత్...

విండీస్ తో జరిగే టీ20లు, వన్డే సిరీస్ జట్టుకు టీమిండియా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే రిషబ్ పంత్ ఎంపిక పట్ల పలు విమర్శలు వచ్చాయి. బంగ్లాతో జరుగుతున్న డే/నైట్ టెస్టుకు రిజర్వ్ ఆటగాడు పంత్ స్థానంలో తెలుగు కుర్రాడు కోన శ్రీకర్ భరత్‌ని ఎంపిక చేసింది. రిజర్వ్ బెంచ్ లో ఉన్న రిషబ్ పంత్ ను జట్టు నుంచి తప్పించింది. మొదట విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికైనా పంత్ తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఆడనున్నాడు. దీంతో అతడి స్థానంలో ఆంధ్రా క్రికెట్ జట్టు వికెట్ కీపర్ శ్రీకర్‌ను ఎంపిక చేసింది.

వెస్టిండీస్ తో డిసెంబర్ ఆరు నుంచి మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది. ఈ సిరీస్ కు రెండు రోజుల క్రితం జట్టును సెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఆ జట్టులో పంత్ కు స్థానం కల్పిపించింది. ప్రస్తుతం సాహా డై-నైట్ టెస్టుకు కీపర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ లో సాహా గాయపడితే అతని స్థానంలో శ్రీకర్ కీపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే పంత్ మాత్రం ఈ గ్యాప్ లో ఢిల్లీ టీమ్ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నిలో ఆడి తిరిగి ఫామ్ అందుకోవాలని చూస్తున్నాడు. విండీస్‌తో జరిగే సిరీస్‌‌లో సత్తాచాటాలని రిషబ్ పంత్ ఆశిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories