IND vs BAN 1st Test, Day 2: భోజన విరామ సమయానికి 188/3

Mayank, Rahane guide INDIA
x
Mayank, Rahane guide INDIA
Highlights

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు భోజన విరామం సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్...

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు భోజన విరామం సమయానికి భారత్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ( 91 పరుగులు 166బంతుల్లో 13 ఫోర్లతో 1 సిక్స్ )తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరో ఆటగాడు రహానే (37 పరుగులు 72 బంతుల్లో 6ఫోర్ల)తో రాణిస్తున్నాడు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ఓవర్ నైట్ స్కోరు 86/1తో రెండో రోజు బరిలోకి దిగిన భారత్ ఆట ప్రారభంలోనే 15 పరుగుల వ్యవధిలో రెండు కీలక వికెట్లను భారత్ చేజార్చుకుంది. రెండో రోజు ప్రారంభమైన టెస్టులో 105 పరుగుల వద్ద చెతేశ్వర్ పుజారా( 54 పరుగులు 72 బంతుల్లో 9 ఫోర్లు) వికెట్ కోల్పోయింది. జాయేద్ బౌలింగ్‌లో సబ్ స్టిట్యూ ప్లేయర్ హసన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పరుగులులేమి చేయకుండానే వెనుదిరిగాడు. జాయేద్ బౌలింగ్ లో ఎల్బీడబ్యూ రూపంలో 119-3 వికెట్లు కోల్పోయింది ఆవుటైయ్యాడు.

తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి భారత్ 86/1(26 ఓవర్లు) పరుగులు చేసింది. మూడో సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. జట్టు 14 పరుగుల వద్ద రోహిత్ జాయద్ బౌలింగ్‌లో లిప్టన్ దాసుకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories