IND vs AUS: ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?.. మ్యాచ్ మధ్యలో పంత్, లైయన్ సంభాషణ!


IND vs AUS: ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?.. మ్యాచ్ మధ్యలో పంత్, లైయన్ సంభాషణ!
IND vs AUS: 'ఐపీఎల్ 2025 వేలంలో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?' అని లైయన్ అడగగా.. 'ఇంకా నాకేమీ తెలియదు, మరో రెండు రోజులు ఆగు’ అని పంత్ బదులిచ్చాడు.
IND vs AUS: మరో రెండు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో వేలం జరగనుంది. ఈసారి వేలంలో భారత్ స్టార్ ప్లేయర్స్ రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్ ఉన్నారు. అయితే అందరి దృష్టి మాత్రం పంత్‌పైనే ఉంది. హిట్టర్, కీపర్, కెప్టెన్.. అన్ని అతడిలో ఉండడమే అందుకు కారణం. ఇప్పటికే పంత్‌పై చాలా జట్లు కన్నేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు, పంజాబ్ సహా ఢిల్లీ కూడా అతడి కోసం భారీగా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందట.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్ 2025 మెగా వేలం గురించే మాట్లాడుకుంటున్నారు. అభిమానులు, మాజీలతో పాటు క్రికెటర్స్ కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్.. రిషబ్ పంత్‌తో ఐపీఎల్ గురించి చర్చించాడు. 'ఐపీఎల్ 2025 వేలంలో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?' అని లైయన్ అడగగా.. 'ఇంకా నాకేమీ తెలియదు, మరో రెండు రోజులు ఆగు’ అని పంత్ బదులిచ్చాడు. ఇద్దరి మధ్య సంభాషణ స్టంప్స్ మైక్‌లో రికార్డు అయింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాగా ఆడుతున్న పంత్ లయను దెబ్బతీసేందుకు లైయన్ ఇలా అడిగాడు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ 2025కి ముందు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. ప్రాంచైజీ ఉండమని కోరినా.. పంత్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. దాంతో అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్‌లను డీసీ రిటైన్ చేసుకుంది. వేలంలో పంత్ కోసం ఢిల్లీ ట్రై చేయనున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. అతడు
25-30 కోట్లు పలుకుతాడని అంచనా. ఇక ఆస్ట్రేలియా, భారత్ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 78 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఈ మ్యాచులో పంత్ తన వైవిధ్యమైన షాట్లను ఆడాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన బంతిని ఫైన్‌లెగ్ దిశగా కొట్టిన షాట్ హైలెట్ అనే చెప్పాలి. పంత్ దాటికి భారత్ 150 రన్స్ చేయగలిగింది.
As only Rishabh Pant can do! 6️⃣#AUSvIND | #PlayOfTheDay | @nrmainsurance pic.twitter.com/vupPuWA8GG
— cricket.com.au (@cricketcomau) November 22, 2024

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



