IND vs AUS: ప్లేయింగ్ ఎలెవన్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవుట్.. నిరాశలో ఫ్యాన్స్

IND vs AUS: ప్లేయింగ్ ఎలెవన్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవుట్.. నిరాశలో ఫ్యాన్స్
x

IND vs AUS: ప్లేయింగ్ ఎలెవన్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అవుట్.. నిరాశలో ఫ్యాన్స్

Highlights

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా బౌలర్లను అత్యధికంగా ఉతికారేసిన భారత బ్యాట్స్‌మెన్ ఎవరంటే అది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు.

IND vs AUS: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా బౌలర్లను అత్యధికంగా ఉతికారేసిన భారత బ్యాట్స్‌మెన్ ఎవరంటే అది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. సొంత గడ్డపై అయినా, ఆస్ట్రేలియాలోనైనా ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ కంగారూ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. అయితే, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం అలా అనుకోవడం లేదు. అందుకే, ఆయన ఎంపిక చేసిన భారత్-ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ జాయింట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్‌కు గానీ, కోహ్లీకి గానీ చోటు దక్కలేదు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, కమిన్స్ ఈ జట్టులో జస్ప్రీత్ బుమ్రాకు కూడా చోటు ఇవ్వకపోవడం, అలెన్ గిల్‌క్రిస్ట్ లాంటి దిగ్గజాన్ని కూడా పక్కన పెట్టడం మరింత ఆశ్చర్యకరం.

ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. తన ఆల్‌టైమ్ భారత్-ఆస్ట్రేలియా జాయింట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నారు. ఈ జట్టులో ఏకంగా ఎనిమిది మంది ఆస్ట్రేలియన్లు, కేవలం ముగ్గురు భారత రిటైర్డ్ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లను అత్యధికంగా ఉతికారేసిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అంతేకాదు, జస్ప్రీత్ బుమ్రా, అలెన్ గిల్‌క్రిస్ట్ వంటి దిగ్గజాలను కూడా కమిన్స్ పట్టించుకోలేదు.

కమిన్స్ ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్లను తీసుకున్నారు. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్‌తో పాటు, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్‌గా), జహీర్ ఖాన్‌లకు మాత్రమే కమిన్స్ చోటు ఇచ్చాడు. బౌలర్లుగా షేన్ వార్న్, బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రా వంటి దిగ్గజాలను కమిన్స్ తన జట్టులో చేర్చుకున్నాడు.

కమిన్స్ టీమ్: డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్‌గ్రా.

తన ప్లేయింగ్ ఎలెవన్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను చేర్చుకోనప్పటికీ, ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆస్ట్రేలియా సిరీస్‌లో ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించగలరని ప్యాట్ కమిన్స్ అంగీకరించారు. విరాట్, రోహిత్ ఆస్ట్రేలియా గడ్డపై తమ చివరి సిరీస్ ఆడుతుండవచ్చు కాబట్టి, ఈ సిరీస్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, రోహిత్, విరాట్ ఇద్దరికీ ఆస్ట్రేలియాలో 50 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేసే అద్భుతమైన రికార్డు ఉంది. ఈ సిరీస్‌లో వారి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories