Under-19 World Cup : ఆసీస్‌పై ఘనవిజయం.. సెమీస్‌లోకి అడుగు పెట్టిన భారత్

Under-19 World Cup : ఆసీస్‌పై ఘనవిజయం.. సెమీస్‌లోకి అడుగు పెట్టిన భారత్
x
INDIA U-19 FIle Photo
Highlights

అండర్ -19 ప్రంపచకప్ లీగ్ మ్యాచ్‌ల్లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుపోయింది. మంగ‌ళ‌వారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అండర్ -19 జట్టును...

అండర్ -19 ప్రంపచకప్ లీగ్ మ్యాచ్‌ల్లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుపోయింది. మంగ‌ళ‌వారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అండర్ -19 జట్టును మట్టికరిపించింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్( 62పరుగులు, 82 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సు)లతో టాప్ స్కోరర్ గా నిలవగా.. అంకోలేకర్ (55 పరుగులు, 54 బంతుల్లో ,5 ఫోర్లు, 1 సిక్సు)తో అజేయ అర్థసెంచరీతో రాణించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

టీమిండియా నిర్ధేశించిన 234 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 43.3 ఓవర్లో 159 పరుగులకు కుప్పకూలిపోయింది. దీంతో భారత్ 74 పరుగుల విజయం సాధించి సెమీఫైనల్లో అడుగు పెట్టింది. కార్తీక్ త్యాగి నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఆకాశ్ సింగ్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. 24 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన త్యాగికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన భార‌త్‌కు శుభారంభం రాలేదు. ఓపెన‌ర్ య‌శస్వి ఒంట‌రి పోరాటం చేశాడు. హైదరాబాద్ ప్లేయర్ తిల‌క్ వ‌ర్మ (2) నిరాశపరిచాడు. య‌శస్వి సహకరించేవారే లేకుండా పోయారు. అయితే చివ‌ర్లో అనోలేక‌ర్ మెరుపు ఇన్నింగ్స్ తోడు, ర‌వి బిష్ణోయ్ (30), సిద్ధార్థ్ వీర్ (25) రాణించ‌డంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌల‌ర్లలో కెల్లీ, మ‌ర్ఫీకి రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

మ‌రోవైపు లక్ష్య ఛేద‌న‌లో ఆసీస్‌కు ఓపెన‌ర్ శామ్ ఫాన్నింగ్ (75పరుగులు, 127 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) ఒంట‌రి పోరాటం చేశాడు. మిగతా అసీస్ బ్యాట్స్ మెన్ విఫ‌ల‌మైయ్యారు. ఓ ద‌శ‌లో ఆసీస్‌ 68/5తో క‌ష్టాల్లో ప‌డింది. స్కాట్ (35), పాట్రిక్ రోవ్ (21) చేయడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. దీంతొ టీండియా-19 జట్టు సెమీఫైనల్లోకి దూసుపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories