IND V PAK U19 Semi-Final 1 : పాకిస్థాన్‌ను వణికిస్తున్న టీమిండియా బౌలర్లు

IND V PAK U19 Semi-Final 1 : పాకిస్థాన్‌ను వణికిస్తున్న టీమిండియా బౌలర్లు
x
IND V PAK
Highlights

అండర్‌-19 ప్రపంచ కప్‌లో టీమిండియా పాక్ సెమీఫైనల్ హోరాహోరిగా సాగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన...

అండర్‌-19 ప్రపంచ కప్‌లో టీమిండియా పాక్ సెమీఫైనల్ హోరాహోరిగా సాగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన పాక్ ఆదిలో ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ఓసెనర్ మొహమ్మద్‌ హారిస్‌(4) వికెట్ కోల్పోయింది. జట్టు 9 పరుగులు వద్ద ఉండగా సుశాంత్ మిశ్రా బౌలింగ్ లో వెనుదిరిగాడు. వెంటనే జట్టు స్కోరు 34 పరుగుల వద్ద ఫహద్‌ మునీర్‌(0) కూడా రవి బిష్ణోయ్‌ అద్భుతమైన డెలివరీతో పెవిలియన్ దారి పట్టించాడు. ఓపెనర్ హైదర్ ఆలీ(56) కెప్టెన్ నజీర్ (30) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరి ఇన్నింగ్స్ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 26 ఓవర్లో బాల్ అందుకున్న జైస్వాల్‌ ఆలీ(56) ఔట్ చేసి వీరి జోడిని వీడదీశాడు. దీంతో 26 ఓవర్లు ముగిసేసరిగి పాకిస్థాన్ మూడు వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది.

రెండు జట్టు గత మ్యాచ్ లో ఆడిన జట్లతోనే బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్‌లో అడుగు‌పెడుతుంది. ఈ మ్యాచ్ గెలుపుపై అటు భారత్ అభిమానులు, పాకిస్థాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్వార్టర్స్‌ ఆస్ట్రేలియాపై విజయంతో భారత్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ సిరీస్ లో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్ లో విజయం సాధించింది. పాక్ మూడు మ్యాచ్‌లో విజయం సాధించిం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మాత్రం డ్రాగా ముగిసింది. కాగా.. అండర్‌-19 వరల్డ్ కప్‌లో టీమిండియా‌, పాకిస్తాన్‌ల మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరిగాయి. భారత్‌ 4 ‎విజయం సాధించి, 5 మ్యాచ్‌లో పరాజయం పాలైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories