Asia cup 2020 : భారత్ ఆడకుంటే అంతే సంగతులు : పాక్

Asia cup 2020 : భారత్ ఆడకుంటే అంతే సంగతులు : పాక్
x
Highlights

పాక్ తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల కారణంగా ఆ దేశంలో భారత్ పర్యటించడం లేదు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఆసియాకప్‌ను నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు ఆతిథ్యహక్కులు...

పాక్ తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల కారణంగా ఆ దేశంలో భారత్ పర్యటించడం లేదు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఆసియాకప్‌ను నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు ఆతిథ్యహక్కులు దక్కించుకుంది. కానీ ఈ టోర్నీలో ఆడేందుకు భారత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ఈ క్రమంలో పాక్ క్రికెట్ బోర్డు సంచలన వాఖ్యలు చేసింది.

తమ దేశంలో జరిగే ఆసియాకప్‌లో భారత్ ఆడకుంటే వచ్చే ఏడాది ఇండియాలో జరిగబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆడబోమని తెల్చిచెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20లో వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఆస్ట్రేలియాతో పాటు సన్నాహకంగా పాక్ కూడా ఈ టోర్నీని పాక్‌లో నిర్వహిస్తుంది..

ప్రస్తుతం ఆ దేశంలో బంగ్లాదేశ్ జట్టు పర్యటిస్తుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపు (ఆదివారం ) రెండో మ్యాచ్ జరుగుతుంది.

ఇక భారత్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది. ఇరు జట్ల మధ్య అయిదు టీ 20, మూడు వన్డే, రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య నిన్న ఆక్లాండ్ వేదికగా మొదటి టీ 20 మ్యాచ్ జరగగా భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపు ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories