రాయుడుకి ఐస్‌లాండ్ క్రికెట్‌ బంపర్ ఆఫర్‌..తమ దేశానికి..

రాయుడుకి ఐస్‌లాండ్ క్రికెట్‌ బంపర్ ఆఫర్‌..తమ దేశానికి..
x
Highlights

ఫోర్త్ ప్లేస్‌కి సరైన వాడంటూ కోహ్లీతో ప్రశంసలు పొందినా ప్రపంచకప్‌ టీమ్‌లో రాయుడుకి చోటెందుకు దక్కలేదు? అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్‌...

ఫోర్త్ ప్లేస్‌కి సరైన వాడంటూ కోహ్లీతో ప్రశంసలు పొందినా ప్రపంచకప్‌ టీమ్‌లో రాయుడుకి చోటెందుకు దక్కలేదు? అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు బీసీసీఐకి తెలిపిన రాయుడు ఎందుకు వైదొలుగుతున్నాడో ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. ఐస్‌లాండ్ క్రికెట్‌ ట్వీట్‌కి రాయుడు రిటైర్మెంట్‌కు సంబంధముందా? అసలు రాయుడు రిటైర్మెంట్‌ వెనుకున్న కారణాలేంటి? వాచ్ దిస్‌ స్టోరీ

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు కెప్టెన్‌గా చేశాడు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 6,151 పరుగులు 6 సెంచరీలు 34 హాఫ్ సెంచరీలు ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ 3 సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు అలాగే అద్భుతమైన స్టైక్ రేట్‌ ఇక ఐపీఎల్‌లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. మరోవైపు టీ20ల్లో ఒక సెంచరీ 24 హాఫ్ సెంచరీలతో మొత్తం 4వేల 584 పరుగులతో అందరికీ సాధ్యంకాని ఎన్నో రికార్డులు రాయుడు ఖాతాలో ఉన్నాయి కానీ అంబటికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచకప్‌ జట్టులో కచ్చితంగా చోటు దక్కుతుందని రాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ చిన్నచిన్న కారణాలతో సెలెక్టర్లు మొండిచేయి చూపారు. అయితే తీవ్ర విమర్శలు చెలరేగడంతో రాయుడుని స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో పెట్టారు. దాంతో తనకు అవకాశం రాకపోతుందా? అంటూ ఎక్కడో మిగిలిన చిన్న ఆశతో ఎదురుచూపులు చూశాడు. అయితే శిఖర్ ధావన్‌, శంకర్ గాయపడ్డా రాయుడుకి మాత్రం పిలుపురాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. రెండోసారి కూడా నిరాశే ఎదురవడంతో ఆవేదనకు గురైనట్లు క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ మనస్తాపంతోనే క్రికెట్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినట్లు అంచనా వేస్తున్నారు.

అయితే కెరీర్ తొలినాళ్లలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న రాయుడు అప్పటి హెచ్‌‌సీఏ బాస్ శివ్‌లాల్‌ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత బీసీసీఐ బ్యాన్ చేసిన ఐసీఎల్‌లో ఆడటంతో వేటుకు గురయ్యాడు. ఇక ఇప్పుడు వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ టార్గెట్‌గా ట్వీట్‌ చేయడం కలకలం రేపింది. రాయుడు కంటే విజయ్‌ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కామెంట్స్‌‌పై రాయుడు వ్యంగ్యంగా స్పందించాడు. తనకిక టీమ్‌లో చోటు దక్కదని అంచనాకొచ్చిన రాయుడు ఈ వరల్డ్ కప్ చూడ్డానికి 3డీ గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడ్ని తమ దేశానికి వచ్చేయమంటూ ఐస్‌లాండ్ ఆహ్వానించింది. రాయుడూ 3డీ గ్లాసెస్‌ను ఇప్పుడైనా పక్కనబెట్టు. మామూలు అద్దాలతో డాక్యుమెంట్లను చదువు. వచ్చి మాతో చేరు. రాయుడంటే మాకెంతో ఇష్టమంటూ ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది. అంతేకాదు ఐస్‌లాండ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా ఐస్‌లాండ్ క్రికెట్ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories