ICC T20 World Cup Final : కాసేపట్లో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌.. మహరాణులు ఎవరో?

ICC T20 World Cup Final : కాసేపట్లో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌.. మహరాణులు ఎవరో?
x
India and Australia ICC Women's T20 World Cup 2020
Highlights

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మరోపక్కన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. మెల్ బోర్న్ వేదికగా రేపు జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మరోపక్కన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్.. మెల్ బోర్న్ వేదికగా రేపు జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారతీయ మహిళలకు బహుమతిగా ఇవ్వాలని టీమిండియా పట్టుదలతో ఉంటే, మరోవైపు కప్ సాధించి తమ దేశ మహిళలల్లో సంతోషం చూడాలని ఆసీస్ కోరుకుంటోంది.

అయితే 2018లో సెమీస్ చేరి వెనుదిరిగిన భారత్ ఇప్పుడు ఫైనల్ చేరింది. భారత్ ఆడిన లీగ్ దశలో అంచనాలకు మించిన ఆటతీరు కనబరిచింది. అదే స్పూర్తితో భారత జట్టు ఫైనల్ కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. పోరాటంలో భారత జట్టు ప్రశంసలు పొందుతోంది. దీంతో మెల్‌బోర్న్‌లో ఎవరు విజయం సాధిస్తారనే ఉత్యంఠ అందిరికి నెలకొంది.

ప్రధానంగా ఈసారి టీమిండియా ఓపెనర్, హిట్టర్ షఫాలీ వర్మ బ్యాట్ ఝులిపించాలని యావత్ భారతం కోరుకుంటోంది. ఇవాళ మ్యాచ్ లో ఆరంభంలోనే ఆమె రాణిస్తే విజయావకాశాలు భారత్ వశమవుతాయనడంలో.. ఆశ్చర్యం అక్కర్లేదు. మరో ఓపెనర్ స్మృతి మంధాన గత నాలుగు మ్యాచులు నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో తనదైన సైలిలో రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా విజృంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత జట్టులో బౌలింగ్ విషయానికి వస్తే.. ఈ టోర్నీలో ప్రతీ మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోరు చేసిన బౌలింగ్ దళం భారత్ ను విజయతీరాలకు చేరుస్తున్నారు. ప్రధానంగా ఫామ్‌లో ఉన్న బౌలర్ పూనమ్ యాదవ్, దీప్తి శర్మ గత మ్యాచ్ లో కంగారూలకు కంగారు పెట్టించారు. ఆసీస్ ప్లేయర్లు ప్రధానంగా పూనమ్‌ను బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే ప్రాక్టీస్ చేశారు. అలాగే స్పిన్నర్లు రాధా యాదవ్‌, రాజేశ్వరి, పేసర్‌ శిఖాపాండే టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

మరోవైపు ఆరోసారి ఫైనల్ చేరిన ఆసీస్ నాలుగుసార్లు చాంపియన్ గా నిలిచింది. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఆస్ట్రేలియా జట్టుకు బలం.

ఆస్ట్రేలియా జట్టులో స్టార్‌ ప్లేయర్‌ ఎలీస్‌ పెర్రీ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం కావడం ఆజట్టుకు పెద్ద దెబ్బ. అయితే , కెప్టెన్‌ లానింగ్, అలీసా హీలీ బెత్‌, మూనీలతో ఆసీస్ జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. బౌలింగ్‌లో ప్రధానంగా జెస్‌ జొనాసన్, మెగాన్‌ షూట్‌లపై ఆధారపడుతోంది.

వర్షం అవకాశం లేదు కాబట్టి, పిచ్‌ కూడా సాధారణ బ్యాటింగ్‌ అనుకులంగా ఉంటుంది‌. అందులోనూ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నీ విజేయతకు రూ.7.40 కోట్లు, రన్నరప్‌ టీమ్‌కు రూ.3.70 కోట్లు ఇవ్వనున్నారు. స్టార్‌స్పోర్ట్స్‌ 1,2, దూరదర్శన్‌ మ్యాచ్‌ను మధ్యాహ్నం 12.30 ప్రసారం కానుంది.

జట్లు అంచనా

భారత్ జట్టు‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, తానియా, రాధా యాదవ్‌, పూనమ్‌,శిఖా పాండే, రాజేశ్వరి.

ఆసీస్ : మెగ్‌ లానింగ్‌ (సారథి‌), మూనీ, ఎలీసా హేలీ, హైన్స్‌, గార్డ్నర్‌, జెస్‌ జాన్సన్‌, దిలిస్సా, నికోలా, జార్జియా, సోఫియా/స్ట్రానో, మెగన్‌ షుట్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories