టీ20 ప్రపంచ‌కప్ .. టీమిండియాతో తలపడే బలమైన జట్లు ఇవే..

టీ20 ప్రపంచ‌కప్ .. టీమిండియాతో తలపడే బలమైన జట్లు ఇవే..
x
ICC WORLD CUP
Highlights

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పొట్టి ఫార్మాట్ రాబోతుంది.

క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో పొట్టి ఫార్మాట్ రాబోతుంది. అయితే పురుషుల క్రికెట్లో కాకుండా ఈ సారి మహిళల టీ20 ప్రపంచకప్ రాబోతుంది. ఈ టోర్నీకి ఆస్ట్రేలియా వేదికకానుంది. తొలి వరల్డ్ కప్ కోసం అందుకోవాలని భారత్ తహతహలాడుతోంది. భారీ ఆశలతోనే బరిలోకి దిగుతోంది. రెండేళ్ల క్రితం కప్పు గెలిచిన ఆస్ట్రేలియా సొంత గడ్డపై జరిగే ప్రపంచ కప్ లో మరో సారి విజయం సాధించాలని ఊవిళ్లురుతోంది. నేపథ్యంలో ఈ టోర్నీ విశేషాలేంటో చూద్దాం..

1. ఈ టోర్నీలో పోటీ పడుతున్న 10 జట్లలో 5 జట్లను ఎ, బి గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌ ఏ దశ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో సాగుతుంది. గ్రూప్‌లో ప్రతి జట్టూ మిగతా 4 జట్లలో ఒక్కో లీగ్‌ మ్యాచ్‌ ఆడుతుంది. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే లీగ్‌ దశలో తొలి రెండు స్థానాల్లో జట్లు నిలవాలి.

2. ఫిబ్రవరి 21న వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను ఢీ కొనబోతుంది. సిడ్నీ వేదికగా ఆరంభ మ్యాచ్‌కు జరగనుంది. మార్చి 8న ఫైనల్‌ పోరుకు మెల్‌బోర్న్‌ వేదిక కానుంది.

3. 2009లో నుంచి జరుగుతున్న ఈ టోర్నీలో తొలి కప్ ఇంగ్లాండ్‌ కైవసం చేసుకుంది. టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు తొలిసారి దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ లేకుండా బరిలోకి దిగబోతోంది. 2009లో వరల్డ్‌కప్‌ నుంచి వరుసగా 6 టోర్నీల్లోనూ.. మిథాలీ రాజ్‌ బరిలోకి దిగింది. అయితే మిథాలీ రాజ్‌ గత వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్‌కు తుది జట్టులోకి తీసుకోలేదు. దీనిపై పెద్ద దుమారం రేపింది. ఆ ఈ మ్యాచ్‌లో మిథాలీ ఉంటే భారత్‌ గెలిచేదని పలువురు అభిప్రాయా పడ్డారు. కాగా.. ఈ సారి హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో భారత్ ఆడనుంది. గత ఏడాది మిథాలీ రాజ్‌ టీ20లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

4. ఆసీస్ ఆతిథ్య జట్టు మాత్రమే కాదు.. టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. భారత్‌, ఇంగ్లాండ్‌లతో జరిగిన ముక్కోణపు సిరీస్‌లోనూ ఆసీస్ విజేతగా నిలవడంతో ఆ జట్టు ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.

5. ఈ టోర్నీలో 10 జట్లు పోటీ పడనున్నాయి.. ఫిబ్రవరి 21న మొదలై మార్చి 8న ముగుస్తుంది. టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరుగుతాయి.


టీమిండియా తన తొలి మ్యాచ్ ఈ నెల 21 ఆస్ట్రేలియాతో తలపడనుంది. 24న బంగ్లాదేశ్, 27 న్యూజిలాండ్, 29న శ్రీలంకతో తలపడనుంది. ఒక శ్రీలంక మినహ టీమిండియా బలమైన జట్లను ఎదుర్కొబోతుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది.

టీ20 ప్రపంచ కప్ ఎంపికైన భారత జట్టు ఇదే.

హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), షెఫాలీ, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, రిచా ఘోష్, తానియా భాటియా, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories