ICC T20 World Cup : రేపే అమ్మాయిల ధనాధన్..4 సార్లు ఛాంపియన్‌తో టీమిండియా పోరు

ICC T20 World Cup : రేపే అమ్మాయిల ధనాధన్..4 సార్లు ఛాంపియన్‌తో టీమిండియా పోరు
x
టీ20 ప్రపంచ కప్
Highlights

క్రికెట్ అభిమానులను, వీక్షకులకు కన్నుల విందు అందించేందుకు మరో సంగ్రామం సిద్దమైంది.

క్రికెట్ అభిమానులను, వీక్షకులకు కన్నుల విందు అందించేందుకు మరో సంగ్రామం సిద్దమైంది. ఈ సారి ప్రేక్షకులను ఉత్కాంఠకు గురిచేసేందుకు మహిళలు సిద్ధమైయ్యారు. ఆస్ట్రేలియా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో తొలి టీ20 మ్యాచ్ టీమిండియా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. తొలి వరల్డ్ కప్ కోసం అందుకోవాలని భారత్ తహతహలాడుతోంది. భారీ ఆశలతోనే బరిలోకి దిగుతోంది. రెండేళ్ల క్రితం కప్పు గెలిచిన ఆస్ట్రేలియా సొంత గడ్డపై జరిగే ప్రపంచ కప్ లో మరో సారి విజయం సాధించాలని ఊవిళ్లురుతోంది. 17 రోజులపాటు జరిగే ఈ మెగా టోర్నీకు ఆస్ట్రేలియా వేదిక కానుంది. టైటిల్‌ వేట కోసం ఇప్పటికే 10 జట్లు అక్కడికి చేరుకున్నాయి.

కాగా..

ప్రపంచకప్ ముందు జరిగిన ముక్కొణపు టోర్నీలో ముక్కోణపు సిరీసు ద్వారా తెలిసింది అదే. మొదట్లో వరుస విజయాలు భారత్ సాధించినా.. ఆ తర్వాత కష్టంగా ఫైనల్‌కు చేరింది. అయితే ఆఖరి మ్యాచులో అద్భుతంగా రాణించిన మంధానకు ఎవరూ అండగా నిలవలేదు. ఈ ప్రపంచకప్‌లో బలమైన జట్లు ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లున్న గ్రూప్‌లో టీమిండియా ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో రాణించే జట్లతో ఆట అంటే అంత సులువు కాదు. పక్కా ప్రణాళికతో దూకుడుగా ఆడకపోతే విజయం కష్టం.

టీమిండియా బలాబలాలు చూస్తే..

ఈ సిరీసులో మంధాన టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌ ప్రాతినిధ్య వహించిన హర్మన్‌ ప్రీత్‌కు ఆస్ట్రేలియాలో పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. ఆల్ రౌండర్ దీప్తిశర్మ ఫామ్ లో ఉండడం శుభసూచికం.ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. మీడియం పేసర్‌ శిఖా పాండే, రాజేశ్వరీ గైక్వాడ్‌ రాధా యాదవ్, అరుంధతిరెడ్డి ఆస్ట్రేలియా పిచ్‌లపై అత్యంత కీలకం. టీమిండియా మహిళ క్రికెటర్లు వికెట్ల మధ్య పరుగులుకు ప్రయత్నించకుండా.. బద్ధకంగా ఉన్నారని మాజీ సారథి డయానా ఎడుల్జీ విమర్శించిన సంగతి తెలిసిందే. నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఎదుర్కొనడం అంటే మామూలు విషయం కాదు.

ఆస్ట్రేలియా జట్టు బలాబాలాలు చూస్తే

ఆస్ట్రేలియా బౌలర్ జెస్‌ జొనాసేన్‌ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ముక్కోణపు టోర్నీలో 12కే 5 వికెట్లు తీసి మంచి ఫామ్ లో ఉంది. వ్లామింక్‌ , ఎలిస్‌ పెరీ, సుతర్లాండ్‌ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్, మూనీ , గార్డ్‌నర్‌, లేనింగ్‌ , రాచెల్‌ హెయ్‌నస్‌, ఫామ్ లో ఉన్నారు.

అయినప్పటికీ భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఏ జట్టునైనా ఒత్తిడిలోకి నెట్టే సత్తా భారత్‌కు ఉందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. సానుకూల దృక్పథమే తమ జట్టు బలమని ఆసీస్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని హర్మన్‌ప్రీత్‌ వెల్లడించింది. తమ ఆటగాళ్లు మైండ్‌లో పాజిటివ్‌ ఎనర్జీ ఉన్నంతవరకు ఎంత జట్టును ఎదుర్కొనడానికి బెంగలేదని స్పష్టం చేసింది. స్లో వికెట్‌ స్టేడియాలు టీమిండియాకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది.

భారతీయులంతా క్రికెట్‌ అభిమానులే, ప్రేక్షకుల ఉత్సాహాల మధ్య తప్పకుండా శుభారంభం చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని తెలిపింది. అయితే ఈ సారి ప్రపంచ కప్‌లో టీమిండియా మిథాలీ రాజ్‌ లేకుండా బరిలోకి దిగనుంది. ఆరు పొట్టి ప్రపంచకప్పుల్లో జట్టును సారథిగా మార్గనిర్దేశకురాలిగా విథాలీ జట్టును ముందుకు నడిపించింది. మిథాలీ రాజ్‌ రిటైర్మెంట్ టీమిండియాకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్లో 8 ఐసీసీ టోర్నీ ఫైనళ్లు ఆడిన మిథాలీ లేకపోవడంతో హర్మన్‌ప్రీత్‌ సేనకు లోటే.

మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ పలు వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా- ఇండియా వుమెన్‌ జట్లు అత్యుత్తమమైనవని అన్నారు. అలాగే టీమిండియా మహిళా జట్టుకు రోహిత్ శర్మ, కోహ్లీ, తోపాటు పలువురు సీనియర్లు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కప్ తో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా అత్యధికంగా 4సార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలిచింది. వెస్టిండీస్‌ (2018), ఇంగ్లండ్‌ (2009) విజేతగా నిలిచాయి. ఓవరాల్‌గా ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి టీమిండియా 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు అంటే రూ. 7 కోట్ల 14 లక్షలు లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు 5 లక్షల డాలర్లు అంటే రూ. 3 కోట్ల 57 లక్షల అందజేస్తారు.

టీమిండియా తన తొలి మ్యాచ్ ఈ నెల 21 ఆస్ట్రేలియాతో తలపడనుంది. 24న బంగ్లాదేశ్, 27 న్యూజిలాండ్, 29న శ్రీలంకతో తలపడనుంది. ఒక శ్రీలంక మినహ టీమిండియా బలమైన జట్లను ఎదుర్కొబోతుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిస్తే సెమీస్ చేరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories