టీమిండియా అమ్మాయిల చేతిలో బంగ్లా చిత్తు

టీమిండియా అమ్మాయిల చేతిలో బంగ్లా చిత్తు
x
India Women
Highlights

కివీస్ పై టీమిండియా అబ్బాయిలు ఓడితే. ఏటువంటి అంచనాలు లేని టీమిండియా అమ్మయిలు జట్టు బంగ్లాపై ఘన విజయం సాధించింది.

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయకేతనం ఎగరవేసింది. ఆస్త్రేలియాలోని పెర్త్‌ వేదికగా బంగ్లాపై జరిగిన పోరులో టీమిండియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ ఓపెనర్ షెఫాలీ వర్మ (39, 17 బంతుల్లో; 2×4, 4×6), జెమిమా రోడ్రిగ్స్‌ (34, 37 బంతుల్లో; 2×4, 1×6) రాణించడంతో బంగ్లా ముందు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 142 పరుగుల చేసింది. వేదా కృష్ణమూర్తి (20), శిఖ పాండే (7) అజేయంగా నిలిచారు. బంగ్లా బౌలర్లో సల్మ రెండు వికెట్లు, పన్నా ఘోశ్‌ రెండు వికెట్లు తీసుకొని సత్తా చాటారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు షెఫాలీ వర్మను వరించింది.

భారత్ నిర్ధేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 124పరుగులకే పరిమితం అయింది. బంగ్లా బ్యాట్స్ ఉమెన్స్‌లో నిగర్‌ సుల్తానా (35పరుగుల 26 బంతుల్లో; 5ఫోర్ల)తో టాప్ స్కోరర్ గా నిలించింది. ముర్షిదా (30 పరుగులు, 26 బంతుల్లో 4 ఫోర్లు)పోరాడింది. టీమిండియా బౌలర్లు పూనమ్‌ 18 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. తెలుగు అమ్మాయి అరుంధతి రెండు వికెట్లు తీసి రాణించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఓపెనర్‌ షమిమా(3) వికెట్ తర్వగా కోల్పోయింది. శిఖ పాండే బౌలింగ్ లో షమియా ఔట్ అయింది. దీంతో సంజిదా(10) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. పూనమ్, అరుంధతి విజృంభించడంతో బంగ్లా 124 పరుగులు మాత్రమే చేయకలిగింది. ఈ విజయంతో ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎలో టీమిండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి చేరేంది. భారత్ తన తర్వాత మ్యాచ్ గురువారం న్యూజిలాండ్ తో తలపడనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories