T20 World Cup 2021: నేటి నుంచే ఐసీసీ టీ-20 వరల్డ్ కప్

ICC T20 World Cup 2021 from 17 10 2021 to 14 11 2021
x

నేటి నుంచే ఐసీసీ టీ-20 వరల్డ్ కప్(ఫైల్ ఫోటో) 

Highlights

*నేటి నుంచి నవంబరు 14 వరకు మెగా టోర్నీ *మొత్తం 16 జట్లతో ఐసీసీ ఈవెంట్ *యూఏఈ వేదికగా ధనాధన్ టోర్నీ

ICC T20 World Cup: ఇండియన్ గ్రేట్ లీగ్ ఐపీఎల్ అలా ముగిసిందో లేదో క్రికెట్ ఫ్యాన్స్‌ కిక్ ఇచ్చేందుకు మరో మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా ఇవాల్టి నుంచే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. నేటి నుంచి నవంబర్ 14 వరకూ జరగనున్న ఈ టోర్నీలో ఇవాళ ఆరంభ మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఒమన్, పాపువా న్యూగినియా జట్లు తలపడనున్నాయి. అలాగే, రాత్రి ఏడున్నర గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి.

ఇక ఈ ఏడాది మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. తొలుత 8 చిన్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియా గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఒమన్, స్కాట్కాండ్, పాపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. దీని అనంతరం సూపర్-12 స్టేజ్ ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏ, గ్రూప్-బి నుంచి టాప్‌లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. ఇదే సమయంలో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి జట్లు నేరుగా సూపర్-12 దశ నుంచి ఈ టోర్నీలో తమ ప్రస్థానాన్ని మొదలు పెడతాయి.

మరోవైపు సూపర్-12 దశలోని గ్రూప్-1లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా వాటితోపాటు గ్రూప్-ఏలో తొలిస్థానం సాధించిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కూడా పోటీపడతాయి. ఇక గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉండగా వాటితో పాటు గ్రూప్-బిలో ప్రథమస్థానం సాధించిన జట్టు, గ్రూప్-ఏలో ద్వితీయ స్థానం సాధించిన జట్టు తలపడనున్నాయి. ఇక సూపర్-12 నుంచి టాప్‌లో నిలిచిన 4 జట్లు సెమీఫైనల్స్‌లో అడుగుపెడతాయి. ఇదిలా ఉంటే తొలి సెమీఫైనల్ నవంబరు 10న, రెండో సెమీఫైనల్ నవంబరు 11న జరగనుండగా విశ్వ విజేతను నిర్ణయించే ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories