కాసేపట్లో న్యూజిలాండ్‌, భారత్ మధ్య కీలక పోరు..గెలిస్తే సెమీస్‌కు

కాసేపట్లో న్యూజిలాండ్‌, భారత్ మధ్య కీలక పోరు..గెలిస్తే సెమీస్‌కు
x
Team India File Photo
Highlights

మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ మరో సమరానికి సన్నద్దమైంది. గ్రూప్‌ 'ఎ'లో నాలుగుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించ భారత్ అదే జోరును పసికూన...

మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్ మరో సమరానికి సన్నద్దమైంది. గ్రూప్‌ 'ఎ'లో నాలుగుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించ భారత్ అదే జోరును పసికూన బంగ్లాపై కూడా చూపించింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. అందరికంటే ముందుగా హర్మన్‌ప్రీత్‌ సేన సెమీస్‌ చేరాలని ఉవ్విళ్లూరుతుంది. భారత జట్టు మరికాసేపట్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా అమ్మాయిలు ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ సమిష్టిగా రాణించారు. పిన్నవయస్కురాలు ఓపెనర్ షఫాలీ వర్మ సంచలనం సృష్టిస్తుంది. జెమీమా రోడ్రిగ్స్‌ గత రెండు మ్యాచ్ ల్లో కీలక సమయంలో రాణించింది. పూనమ్‌ యాదవ్‌ స్పిన్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంటే.. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి బౌలింగ్ లో చక్కగా రాణిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ నిరాశపరిచింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కూడా రాణిస్తే భారత్‌కు అడ్డు వుండదు.

డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన జ్వరంతో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టం కానుంది. దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి కీలక సమయాల్లో రాణిస్తే భారత్ కు తిరుగుండదు. స్పిన్నర్‌ పూనమ్‌తో పాటు పేసర్‌ శిఖా పాండే సమర్థంగా ఆడుతున్నారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్ ల్లో భారత్ విజయానికి బౌలింగ్‌ ఎంతగానో దోహదపడింది.

ఇక న్యూజిలాండ్ జట్టు విషయానికొస్తే భారత్‌పై ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది. న్యూజిలాండ్ మూడు సార్లు భారత్‌పై గెలిచింది. కెప్టెన్, ఆల్‌రౌండర్‌ సోఫీ డివైన్, సుజీ బేట్స్‌, బౌలింగ్‌లో అమెలియా కెర్‌, లియా తహుహు ఆ జట్టుకు ప్రధాన బలం. న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధిస్తే ఇక సెమీఫైనల్ వెళ్లడం ఖాయం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories