మూడోసారి కొనసాగలేను.. క్రికెట్‌కు మంచి రోజులు వచ్చాయ్, నెటిజన్లు

మూడోసారి కొనసాగలేను.. క్రికెట్‌కు మంచి రోజులు వచ్చాయ్, నెటిజన్లు
x
Shashank Manohar
Highlights

ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇండిపెండెట్ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం 2020 మే నెలలో ముగియనుంది, ఆయన మారోసారి బాధ్యతలు నిర్వహించేందుకు సిద్దంగా లేనట్లు స్పష్టం చేశారు.

ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇండిపెండెట్ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం 2020 మే నెలలో ముగియనుంది, ఆయన మారోసారి బాధ్యతలు నిర్వహించేందుకు సిద్దంగా లేనట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు సార్లు చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2016లో తొలిసారి ఐసీసీ ఇండిపెండెట్ చైర్మన్‌ పదవిని ప్రవేశపెట్టారు. శశాంక్‌ మనోహర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఐదేళ్ల పాటు తన పదవీకాలం కొసాగించారు.

అయితే ఐసీసీ డైరెక్టర్లు శశాంక్‌ మనోహర్‌నే మరోమారు కొనసాగించాలని భావిస్తున్నారు. దీనిపై ఆయన సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. మరో రెండు సంవత్సరాలు కొనసాగతాని డైరెక్టర్లు కోరారు. దీనికి ఆయన సమ్మతించలేదు. అంతే కాకుండా ఇప్పటికే ఐదేళ్లు పదవి చేపట్టానని మరో రెండు ఏళ్లు కొనసాగడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ ఇండిపెండెట్ పదవి నుంచి తప్పుకుంటే బీసీసీఐకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐకి మంచి రోజులు రాబోతున్నాయని నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. క్రికెట్ పట్టిన దరిద్రం పోతుందని మరో నెటిజన్ ట్విట్ చేస్తున్నారు.

శశాంక్‌ మనోహర్‌ చైర్మన్ గా ఎంపికైయ్యాకా ఆయన పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఐసీసీ బీసీసీఐ పెత్తనానికి కళ్లెం వేశారు. ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులు పెట్టారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు( బీసీసీఐ)తో, పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారాలు రద్దు చేశారు. ఐసీసీ వచ్చే ఆదాయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ వాటాను తగ్గించారు. శాశ్వత సభ్యత్వాన్ని కూడా ఆయన రద్దు చేశారు. శశాంక్‌ మనోహర్‌ చైర్మన్ గా ఉన్న రోజుల్లో బీసీసీఐను అనేక ఇబ్బందులు పెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories