కాసేపట్లో ఐసీసీ కీలక సమావేశం.. గంగూలీకి ఛాన్స్ దక్కేనా

కాసేపట్లో ఐసీసీ కీలక సమావేశం.. గంగూలీకి ఛాన్స్ దక్కేనా
x
Highlights

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనుంది.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్ నెలలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై వచ్చే నెలలో నిర్ణయం ప్రకటిస్తామని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అలాగే కొత్త చైర్మన్‌ ఎంపిక నామినేషన్‌ ప్రక్రియపై గురువారం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల అంశంపై ప్రధానంగా చర్చించనుంది.

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సభ్య దేశాలతో ఈరోజు జరుగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో నామినేషన్‌పై ఓ నిర్ణయానికి రానున్నారు. ప్రస్తుత చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. అయితే ఐసీసీ చైర్మన్‌ పదవికి జరిగే ఎన్నిక తేదీని ఇవాళ ప్రకటిస్తారో లేదో తెలియదని, శశాంక్‌ మనోహర్‌ వారసుడి ఎంపిక ప్రక్రియే భేటీలో ప్రధాన అజెండా.. నామినేషన్ల విధివిధానాలపై చర్చ జరగొచ్చని అధికారి తెలిపారు.

శశాంక్‌ మనోహర్‌ పదవీ కాలం ముగియగా.. మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇంగ్లండ్‌ కు చెందిన కొలిన్‌ గ్రోవర్‌ పేరు వినిపించినా.. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ ఎహ్‌సాన్‌ మనీ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈసీబీ మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ చైర్మన్‌ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. సౌరవ్‌ గంగూలీ ఆసక్తి కనబరిస్తు ఐసీసీ ఛైర్మన్‌ ఎన్నిక ఆసక్తికరంగా మారుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories