టీ20 ప్రపంచ‌క‌ప్ టోర్నీపై ఐసీసీ నిర్ణ‌యం వాయిదా

టీ20 ప్రపంచ‌క‌ప్ టోర్నీపై ఐసీసీ నిర్ణ‌యం వాయిదా
x
Highlights

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా టోర్నీలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రీడా టోర్నీలు వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరగనున్న ఐసీసీ ప్రపంచకప్ కూడా సందిగ్ధం నెల‌కొంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ స‌మావేశం దుబాయ్‌లో గురువారం జ‌రిగింది. టీ20 ప్రపంచ‌క‌ప్ టోర్నీ నిర్వహణపై ఐసీసీ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తుంద‌ని అందరూ ఉత్కంఠగా ఎదురూ చూశారు. ఐసీసీ తన నిర్ణ‌యాన్ని వ‌చ్చేనెల 10కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.

ఈ టోర్నీపై స‌భ్య‌దేశాల‌తో చ‌ర్చించిన తర్వాత నిర్ణ‌యం వాయిదా వేసింది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఖాళీ స్టేడియాల‌లో ఈ టోర్నీని నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితులుంటాయ‌ని క్రీడా విశ్లేషకులు భావించారు. దుబాయ్ లో నిర్వహించిన సమావేశంలో వ‌చ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ చేయాలా లేదా అనే దానిపై చ‌ర్చించారు. అయితే ఏకాభిప్రాయం రాక‌పోవ‌డంతో నిర్ణ‌యాన్ని వాయిదా వేశారు. మ‌రోవైపు అంత‌ర్గ‌త విష‌యాల‌పై ఎథిక్స్ ఆఫీస‌ర్ నేతృత్వంలో.. ఒక క‌మిటీని వేయ‌నున్న‌ట్లు ఐసీసీ తెలిపింది. మ‌రోవైపు ఐసీసీ చైర్మ‌న్ శ‌శాంక్ మ‌నోహ‌ర్ వార‌సుడి ఎంపిక‌పై జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. భార‌త మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్ర‌స్తుత చీఫ్ సౌర‌వ్ గంగూలీ పేరు బలంగా వినిపిస్తోంది.


హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories