శునకానికి ఐసీసీ ప్రత్యేక పురస్కారం.. ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్‌ అవార్డు!

ICC Announced Dog Of The Month Award
x

ఐసీసీ డాగ్ ఆఫ్ ది మంత్‌ అవార్డు (ఫోటో: ఐసీసీ)

Highlights

* ఐర్లండ్‌లో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి బంతిని నోట కరచుకుని తిరుగుతూ బ్యాటర్‌కు అందజేత * సోషల్ మీడియాలో వీడియో వైరల్

ICC Dog Of The Month: ఐసీసీ పురస్కారం శునకానికా.. అని ఆశ్చర్యపోకండి. ఇది నిజంగా నిజమే. ఐసీసీ ప్రతినెల క్రికెటర్లకు పురస్కారాలు ప్రకటించడం పరిపాటి. అయితే, ఈసారి అందులో ఓ శునకం కూడా చోటు సంపాదించుకుంది. ఓ ప్రత్యేక పురస్కారంతో ఐసీసీ దానిని సత్కరించింది. ఇంతకీ ఏం జరిగిందంటే ఐర్లండ్‌లో ఓ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలోకి దూసుకొచ్చిన ఓ శునకం బంతిని నోటితో పట్టుకుని పరుగులు తీసింది.

దానిని అలా పట్టుకుని పరిగెడుతూ చివరికి బ్యాటర్ వద్దకెళ్లి ఆ బంతిని ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో స్పందించిన ఐసీసీ.. బ్యాటర్‌కు బంతి అందించి, అందరి మనసులు చూరగొన్న ఆ శునకాన్ని ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. నోటితో బంతి, తలపై టోపీతో ఉన్న శునకం ఫొటోను ఐసీసీ ఈ సందర్భంగా షేర్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories