సుచ్, సచ్ ఎవరికైనా తెలుసా? ట్రంప్‌పై ఐసీసీ, మాజీ క్రికెటర్ పీటర్సన్‌ సెటైర్లు

సుచ్, సచ్ ఎవరికైనా తెలుసా? ట్రంప్‌పై ఐసీసీ, మాజీ క్రికెటర్ పీటర్సన్‌ సెటైర్లు
x
ICC Trolls Trump
Highlights

ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ కూడా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇంగ్లండ్‌ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ కూడా ట్రంప్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.ఇదే విషయంపై పీటర్సన్‌ ట్వీట్ చేశారు. ట్రంప్ లెజెండ్స్‌ పేర్లను పలికేముందు తగిన రీసెర్స్‌ చేయాలని సూచించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అహ్మదాబాద్‌లోని నూతనంగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మొతెరా స్టేడియంలో నిర్వహించిన 'నమస్తే ట్రంప్‌' కార్యక్రమంలో జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే తన ప్రసంగంలో భారతీయుల పేర్లు, పండగలు, సినిమాల గురించి ప్రస్తావించారు.

అయితే కొందరి పేర్లు పలకడంలో ట్రంప్ తడబడ్డారు. ఈ క్రమంలో చాయ్‌ వాలా బదులుగా చీవాలా అని పలకడం అంతే కాకుండా, వేదాలను వేస్టాస్‌ అని, స్వామి వివేకానంద పేరును వివేకముందగా ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా టీమిండియా క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లిల గురించి ప్రస్తావించారు. అయితే ట్రంప్‌ వారి పేర్లను ఉచ్చరించడంలో విఫలమయ్యారు. దీంతో నెటిజన్లు ట్రంప్‌ను సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు.

టీమిండియా దిగ్గజాల పేర్లు ట్రంప్‌ నోటి నుంచి రావడంతో కొందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరూ మాత్రం ((సచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోహ్లి)ల పేర్లు సుచిన్‌ టెండూల్కర్‌, విరాట్‌ కోలీ అని ఉచ్చరించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంత్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కూడా ట్రంప్‌ను ట్రోల్‌ చేసింది. సచిన్(Sachin) 'sach, such, sooch ,satch, sutch, లాంటి పేర్లు ఎవరికైనా తెలుసా?'అని క్రికెట్ అభిమానులను ఐసీసీ ప్రశ్నించింది. అయితే ఈ ట్వీట్ వైరల్ నెటింట్లో వైరల్ అవుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories