Sakshi Malik: కుస్తీ వ‌దిలేస్తున్నా.. ఏడ్చేసిన సాక్షీ మాలిక్‌

I Am Quitting Wrestling Said Sakshi Malik
x

Sakshi Malik: కుస్తీ వ‌దిలేస్తున్నా.. ఏడ్చేసిన సాక్షీ మాలిక్‌

Highlights

Sakshi Malik: పూర్తిగా రెజ్లింగ్ నుంచి వైదొలుగుతానని ప్రకటన

Sakshi Malik: రెజ్ల‌ర్ సాక్షీ మాలిక్ ఆవేద‌న‌కు గురయ్యారు. రెజ్లింగ్ క్రీడ‌ను వ‌దిలేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో .. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ స‌న్నిహితుడు సంజ‌య్ సింగ్ విజ‌యం సాధించ‌డం .. మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను క‌లిచివేసింది. 40 రోజుల‌గా రోడ్ల‌పై ధ‌ర్నా చేప‌ట్టామ‌ని, త‌మ‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని, కానీ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థి ఓట‌మి పాలైన‌ట్లు సాక్షీ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు.

బ్రిజ్ భూష‌ణ్ బిజినెస్ పార్ట్న‌ర్ విజ‌యం సాధించార‌ని, రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యార‌ని, అందుకే రెజ్లింగ్ క్రీడ‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు సాక్షీ మాలిక్ వెల్ల‌డించారు. సంజ‌య్ గెలుపును త‌ట్టుకోలేక‌పోయిన సాక్షీమాలిక్‌.. మీడియా స‌మావేశం నుంచి ఏడ్చుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories