పొల్లు పొల్లుగూ కొట్టిన హైదరాబాద్

పొల్లు పొల్లుగూ కొట్టిన హైదరాబాద్
x
Highlights

సొంతగడ్డపై అద్భుత విజయంతో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. నేడు హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు...

సొంతగడ్డపై అద్భుత విజయంతో జోరు మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్.. నేడు హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగుళూరు బౌలర్లను చీల్చి చెండాడారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగుకు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (114), డేవిడ్ వార్నర్(100) నాటౌట్, భారీ శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి 185 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 185 పరుగుల వద్ద 114 పరుగులు చేసిన బెయిర్ స్టో.. క్యాచ్ అవుట్ అయ్యాడు.

ఆ తరువాత బ్యాటింగుకు దిగిన విజయ్ శంకర్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి రన్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే యూసుఫ్ పఠాన్ క్రీజులోకి వచ్చాడు. దీంతో డేవిడ్ వార్నర్ స్కోర్ బోర్డు ను ఉరకలెత్తించాడు. మొత్తం 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది హైదరాబాద్. బెంగుళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ 1 వికెట్ తీశాడు. కాగా ఓపెనర్లు ఇద్దరు సెంచరీలు సాధించడం చెప్పుకోదగ్గ విషయం.





Show Full Article
Print Article
Next Story
More Stories