ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకున్న సన్‌రైజర్స్‌

ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకున్న సన్‌రైజర్స్‌
x
Highlights

సొంతగడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘనవిజయం సాధించేసింది. దీంతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సోమవారం జరిగిన కీలకమైన పోరులో హైదరాబాద్‌...

సొంతగడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఘనవిజయం సాధించేసింది. దీంతో ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా నిలుపుకుంది. సోమవారం జరిగిన కీలకమైన పోరులో హైదరాబాద్‌ 45 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్‌ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

213 పరుగుల లక్ష్యంతో ఛేజింగుకు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. పంజాబ్ ఆటగాళ్లలో లోకేశ్‌ రాహుల్‌ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. రషీద్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్‌ చెరో 3 వికెట్లు తీశారు. వార్నర్‌ కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories