Gautam Gambhir : ఇంగ్లాండ్ పై చేసిన తప్పు కారణంగా ముగిసిన గంభీర్ కెరీర్.. అదేంటంటే ?

Gautam Gambhir : ఇంగ్లాండ్ పై చేసిన తప్పు కారణంగా ముగిసిన గంభీర్ కెరీర్.. అదేంటంటే ?
x
Highlights

ఒక తప్పు ఎంత ఖరీదైనదో చెప్పడానికి ప్రస్తుత టీం ఇండియా ప్రధాన కోచ్ క్రికెట్ కెరీర్ ఒక గొప్ప ఉదాహరణ. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ ఒక తప్పు చేశాడు.

Gautam Gambhir : ఒక తప్పు ఎంత ఖరీదైనదో చెప్పడానికి ప్రస్తుత టీం ఇండియా ప్రధాన కోచ్ క్రికెట్ కెరీర్ ఒక గొప్ప ఉదాహరణ. 2012లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ ఒక తప్పు చేశాడు. దీని కారణంగా అతడి టీ20 కెరీర్ ఆ తర్వాత 52 బంతుల్లోనే ముగిసింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఆ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో, ఇంగ్లాండ్ ఆ మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో గెలుచుకుంది. దీనిలో టీం ఇండియా తరపున ఓపెనర్‌గా ఆడుతున్న గంభీర్ విలన్‌గా మారిపోయాడు.

గంభీర్ చేసిన తప్పు ఏమిటి?

ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. భారత్ తరఫున గంభీర్, రహానే ఓపెనింగ్ కు వచ్చారు. అయితే, రహానే కేవలం 5 బంతులు ఆడే అవుట్ కావడం జట్టుకు తొలి ఎదురుదెబ్బ. ఈ సమయంలో గంభీర్ జట్టుకు మెరుగైన ఆరంభాన్ని అందించాల్సి ఉంది. కానీ అతను అతి స్లో ఇన్నింగ్స్ ఆడి, 27 బంతుల్లో కేవలం 17 పరుగులు చేశాడు. టీ20 మ్యాచ్‌లలో వేగవంతమైన ఆరంభం అవసరమని తెలిసినప్పటికీ, గంభీర్ స్లో ఇన్నింగ్స్‌తో జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు.

జట్టుకు దురదృష్టం

ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ టీ20 మ్యాచ్‌లో టీం ఇండియాకు త్వరగా ఆరంభం ఇవ్వలేకపోవడం గంభీర్ చేసిన అతిపెద్ద తప్పు. ఎందుకంటే గంభీర్ స్లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన గంభీర్ 27 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. గంభీర్ స్లో ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఇతర ఆటగాళ్ల సహకారంతో, ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 177 పరుగులు చేయగలిగింది.

52 బంతుల తర్వాత కెరీర్ క్లోజ్

తొలుత నుంచి ఇలా ఆడి ఉంటే భారతదేశం మరికొన్ని పరుగులు చేయగలిగేదని స్పష్టమైంది. గంభీర్ వేగంగా ఇన్నింగ్స్ ఆడి ఉంటే స్కోరు బోర్డుకు మరికొన్ని పరుగులు యాడ్ అయ్యేవి. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ స్లో ఇన్నింగ్స్ తర్వాత, గంభీర్ T20 కెరీర్ మరో రెండు మ్యాచ్‌ల వరకు కొనసాగింది. అతను పాకిస్తాన్‌తో జరిగిన స్వదేశీ T20 సిరీస్‌లో తదుపరి 2 మ్యాచ్‌లు ఆడాడు. మొదటి మ్యాచ్‌లో అతను 41 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగిన రెండో టీ20లో గంభీర్ 11 బంతుల్లో 21 పరుగులు చేశాడు. ఈ విధంగా గంభీర్ రెండు మ్యాచ్‌ల్లో 52 బంతులు ఎదుర్కొని 64 పరుగులు చేశాడు. దానితో అతని T20 కెరీర్ ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories