కరోనా వల్ల ఐపీఎల్‌ 13 కు జరిగే నష్టం ఎంత?

కరోనా వల్ల ఐపీఎల్‌ 13 కు జరిగే నష్టం ఎంత?
x
IPL Trophy (File Photo)
Highlights

ఐపీఎల్‌.. క్రికెట్ దశ, దిశను మార్చేసిన లీగ్‌.. అప్పటివరకు క్రికెట్ ఉన్న క్రేజ్ ఒకెత్తు అయితే ఈ లీగ్ వచ్చాక క్రికెట్ కి పెరిగిన క్రేజ్ మరో ఎత్తు అని చెప్పాలి.

ఐపీఎల్‌.. క్రికెట్ దశ, దిశను మార్చేసిన లీగ్‌.. అప్పటివరకు క్రికెట్ ఉన్న క్రేజ్ ఒకెత్తు అయితే ఈ లీగ్ వచ్చాక క్రికెట్ కి పెరిగిన క్రేజ్ మరో ఎత్తు అని చెప్పాలి.అప్పటివరకు బోసిపోయిన స్టేడియంలలో సందడి, లక్షల్లో జనం, బాల్ బాల్ కి నరాలు తెగిపోయే ఉత్కంఠ, మ్యాచ్ మ్యాచ్ కి టైటిల్ ఫేవరెట్ గా ఎదిగే టీమ్స్ ఇలా గత 12 ఏళ్లుగా కాసుల వర్షం కురిపించిన ఈ ఐపీఎల్ పైన ఇప్పుడు కరోనా దెబ్బ భారీగానే పడింది..

అనుకున్న షెడ్యుల్ ప్రకారం మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సి ఉన్న ఐపీఎల్‌ 13 సీజన్ కరోనా ఎఫెక్ట్ వలన ఏప్రిల్ 15కి వాయిదా బీసీసీఐ వేసింది. అది కూడా కరోనా ప్రభావం దేశంలో సద్దుమణిగితే ప్రారంభం అవుతుంది.. లేదంటే ఈ ఏడాది ఐపీఎల్‌ లేదన్నట్టే లెక్క.. ఒకవేళ అదే జరిగితే బీసీసీఐకి , ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్‌‌లకి కలిపి మొత్తంగా రూ.10వేల కోట్లపైనే నష్టం జరుగుతుందని తెలుస్తోంది.

ఇక ఐపీఎల్ టోర్నీని స్టార్ స్పోర్ట్స్ రూ. 16వేల కోట్లతో ఐదేళ్ళకు గాను ఒప్పందం చేసుకుంది. ఇందులో ప్రతి ఏటా 20% లాభాన్ని ఆశిస్తోంది. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ పూర్తిగా రద్దు అయితే మాత్రం దాదాపుగా రూ. 3200 కోట్లని స్టార్ స్పోర్ట్స్ నష్టపోవాల్సి వస్తోంది. ఇక సీజన్ 13 కి ముందే దాదాపుగా 200 యాడ్స్ కంపెనీలు ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్, బ్రాడ్‌కాస్టర్, ఫ్రాంఛైజీలతో రూ. 100 కోట్లతో ఒప్పందాలు పూర్తి చేసుకున్నాయట. ఒకవేళ ఈ ఏడాది ఐపీఎల్‌ రద్దు అయితే తిరిగి అమౌంట్ ని రిటర్న్ చేయాల్సి ఉంటుంది.

ఇక ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి ఏప్రిల్ 15 నుంచి సీజన్ 13 మొదలైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం వీసాలను మళ్లీ నిరాకరిస్తే విదేశీ ఆటగాళ్ళు ఆడే ఛాన్స్ లేదు.. పోనీ దేశవాళీ ఆటగాళ్లతోనే సీజన్ ని కొనసాగిద్దామా అంటే అందుకు ఫ్రాంఛైజీలు ఒప్పుకోవు.. మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలన్నా కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టాలి అంతే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories