Vibhav Suryavamsi : 'మాతో ఆడేవాడు, వాడికి 16 ఏళ్లు'..వైభవ్ సూర్యవంశీ ఏజ్ పై చెలరేగిన వివాదం

Vibhav Suryavamsi :
x

Vibhav Suryavamsi : 'మాతో ఆడేవాడు, వాడికి 16 ఏళ్లు'..వైభవ్ సూర్యవంశీ ఏజ్ పై చెలరేగిన వివాదం

Highlights

ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

Vibhav Suryavamsi : ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ తర్వాతి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, వైభవ్ అసలు వయసు 14 కాదు 16 ఏళ్లంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. మొదట వారు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవారని చెబుతారు. తర్వాత వైభవ్ సూర్యవంశీ తమతో ఆడేవాడని, అతనికి బౌలింగ్ చేసి ప్రాక్టీస్ కూడా చేయించేవారని తెలిపారు.

ఆ వ్యక్తి మాట్లాడుతూ, "అతని కన్నా ఎక్కువ కష్టం అతని తండ్రిది. రోజూ పాట్నా తీసుకెళ్లడం, మమ్మల్ని పిలవడం, పార్టీ ఇవ్వడం, మేం అతని ముందు బౌలింగ్ చేసి ప్రాక్టీస్ చేయించేవాళ్లం" అని చెప్పాడు.

వైభవ్ సూర్యవంశీ అసలు వయసు 16 ఏళ్లా?

ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూ, "అతను (వైభవ్) నెమ్మదిగా ఆడే రకం కాదు, ఎక్కడ ఆడినా మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు. బీహార్ కుర్రాడు దుమ్మురేపుతున్నందుకు గర్వంగా ఉంది కానీ బాధేంటంటే అతని వయసు 14 ఏళ్లని చెబుతున్నారు. అసలు వయసు చెబితే ఇంకా బాగుండేది. అతని అసలు వయసు 16 ఏళ్లు" అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉంటే 2023లో వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కూడా వైరల్ అవుతోంది. అందులో సెప్టెంబర్‌లో తనకు 14 ఏళ్లు నిండుతాయని చెప్పాడు. అతని వయసుపై చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ వేలంలో 1.1 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసి మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు. తన మూడో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేశాడు, ఐపీఎల్ చరిత్రలో ఏ భారతీయ ఆటగాడైనా చేసిన వేగవంతమైన సెంచరీ ఇదే. ఐపీఎల్‌లో ఆడుతున్న అతి చిన్న వయస్కుడైన ఆటగాడు కూడా అతనే. ముంబైతో ఓడిపోవడంతో రాజస్థాన్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories