వైరల్: డుప్లెసిస్ మాటలతో ఖంగుతిన్న మ్యాచ్ ప్రజెంటర్

వైరల్: డుప్లెసిస్ మాటలతో ఖంగుతిన్న మ్యాచ్ ప్రజెంటర్
x
డుప్లెసిస్
Highlights

సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ చెప్పిన ఓ జవాబు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ చెప్పిన ఓ జవాబు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షణాఫ్రికాలో ప్రస్తుతం మాన్షి సూపర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్‌లో పార్ల్ రాక్స్ జట్టుకు డుప్లెసిస్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ నెల్సన్ మండేలా టీమ్‌ పార్ల్ రాక్స్ టీమ్ ముందు జరగనుంది. మ్యాచ్ ముందు నిర్వహించిన టాస్‌లో డుప్లెసిస్ ఓడిపోయాడు. నెల్సన్ మండేలా సారథి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా.. మ్యాచ్ ప్రజెంటర్ డుప్లెసిస్ ని పలు ప్రశ్నలు అడిగాడు.

జట్టులో మార్పుల గురించి అని అడిగిన ప్రశ్నకు డుప్లెసిస్. ఆసక్తికర జవాబు చెప్పాడు. దీంతో అది విన్నవారంతా నవ్వుకున్నారు. జట్టులో మార్పుల విషయమై మాట్లాడిన డుప్లెసిస్.. ఈ మ్యాచ్ లో హార్డస్ విల్జోయోన్ అందుబాటులో ఉండరంటూ చెప్పారు. దానికి ఓ కారణం కూడా చెప్పాడు డుప్లెసిస్. హార్డస్ విల్జోయెన్ నా చెల్లితో కలిసి డేటింగ్‌లో ఉన్నాడు. అందుకు హార్డస్ విల్జోయెన్ ఈ మ్యాచ్ లో ఆడడం లేదని డుప్లెసిస్ స్పష‌్టం చేశారు.

డుప్లెసిస్ సోదరి రేమీ రైనర్స్‌తో విల్జోయెన్ గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. కాగా ఇరుకుటుంబ సభ్యులు అంగీకరించడంతో వారు పెళ్లి చేసుకున్నారు. డుప్లెసిస్ చెప్పిన జవాబుతో అక్కడ ఉన్న వారంతా నవ్వు ఆపులేకపోయారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాక్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 168 /5 చేసింది. లక్ష్యఛేదనలో నెల్సన్ మండేలా టీమ్ 6వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేయకలిగింది. హార్డస్ విల్జోయోన్ కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున పాతినిథ్యం వహిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories