
Hardik Pandya: మహికా శర్మకు వాలెంటైన్స్ డే గిఫ్ట్.. హార్దిక్ పాండ్య కొత్త టాటూ వెనుక భావోద్వేగ కథ!
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా టాటూతో సర్‌ప్రైజ్ వ్యక్తిగత జీవితాన్ని గుర్తుచేసే భావోద్వేగ సందేశం
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం (ఫిబ్రవరి) కొలంబోలో దాయాది పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య వార్తల్లో నిలిచాడు. హార్దిక్ తన ఆటతో కాకుండా.. వ్యక్తిగత విషయంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. హార్దిక్ తన గర్ల్‌ఫ్రెండ్ మహిక శర్మతో కొలంబోలోని ఓ హోటల్ లాబీలో కనిపించాడు. ఇద్దరు కలిసి హోటల్ లోపలికి వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే హార్దిక్ తాజాగా వేయించుకున్న కొత్త టాటూ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
టాటూ కేవలం ఒక స్టైల్ మాత్రమే కాదు.. హార్దిక్ పాండ్య వ్యక్తిగత జీవితం, ప్రేమ, బంధం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే భావోద్వేగ కథగా నిలిచింది. ముంబైలోని ప్రముఖ టాటూ స్టూడియో ఎలియెన్స్ టాటూలో హార్దిక్ టాటూ వేయించుకున్నాడు. సెలబ్రిటీ టాటూ ఆర్టిస్ట్ సన్నీ భానుశాలి, ప్రధాన ఆర్టిస్ట్ తుషార్ మారనే కలిసి టాటూ వేశారు. హార్దిక్ తన ఫియాన్సీ మహికా పేరులోని M అక్షరాన్ని మెడ వెనుక భాగంలో చిన్నగా వేయించుకోవాలని భావించాడు. కానీ ఇద్దరి మధ్య చర్చల తర్వాత అర్థంతో కూడిన సింబాలిక్ డిజైన్‌గా మారింది. టాటూలో రెండు చిరుత పులులు కనిపిస్తాయి. ఒకటి బలాన్ని, ధైర్యాన్ని, లక్ష్యసాధనను సూచిస్తే.. మరోటి లైన్స్‌తో రూపుదిద్దుకుని దాని ఆకారంలో M అక్షరం దాగి ఉంటుంది. ఇది ఇద్దరు వ్యక్తులు తమ నమ్మకం, ధైర్యంను కోల్పోకుండా ముందుకు సాగుతారనే భావనను ప్రతిబింబిస్తుంది.
ఈ డిజైన్ రూపకల్పనలో సిద్ధేష్ గావ్డే, దేవేంద్ర పలావ్ కూడా భాగస్వాములయ్యారు. టాటూ మెడ వెనుక భాగంలో వేయడం కూడా ఉద్దేశపూర్వకమే అని తెలుస్తోంది. కనిపించకుండా ఉండడమే కాకుండా.. బలమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. సన్నీ భనుషాలి మాట్లాడుతూ.. 'కొన్ని టాటూలు కేవలం ఆర్డర్ ప్రకారం వస్తాయి. కొన్ని మాత్రం స్టోరీగా తయారవుతాయి. హార్దిక్ టాటూ రెండో రకం. ఇది టాటూ ఇంక్ కాదు, ఓ మధుర జ్ఞాపకం. ఈ టాటూ కోసం ఎన్నో చర్చలు, డిజైన్ మార్పులు జరిగాయి' అని తెలిపారు. ఈ టాటూ హార్దిక్ ప్రేమకు గుర్తు కాదు.. బంధంలో వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ కలిసి ముందుకు సాగాలనే భావనకు ప్రతీకగా నిలిచింది. హార్దిక్ కొత్త టాటూ వెనుక భావోద్వేగ కథ ఇది. మహికా శర్మకు సరైన వాలెంటైన్స్ డే గిఫ్ట్ అనే చెప్పాలి.
- Valentine Day 2026
- Bet Valentine Gift
- Hardik Pandya
- Mahika Sharma
- Hardik Pandya Mahika Sharma
- Hardik Pandya tattoo
- Hardik Pandya new tattoo
- Hardik Pandya new tattoo meaning
- Hardik Pandya Valentine gift
- Hardik Pandya tattoo story
- Indian cricketer tattoo
- celebrity tattoo news
- Hardik Pandya latest news
- leopard tattoo symbolism
- Aliens Tattoo studio
- Hardik Pandya’s Valentine Gift Tattoo for Mahika Sharma
- Emotional Story Behind Hardik Pandya’s New tattoo

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




