అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya
x
Hardik Pandya
Highlights

టీమిండియా యువఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ కోరి కష్టాలు కొనితెచ్చుకొంటున్నారు. కాఫీ విత్ కరన్ షోలో యువతులు, మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా పాండ్యా, రాహుల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నారు.

టీమిండియా యువఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ కోరి కష్టాలు కొనితెచ్చుకొంటున్నారు. కాఫీ విత్ కరన్ షోలో యువతులు, మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా పాండ్యా, రాహుల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాదు బీసీసీఐ సైతం ఈ ఇద్దరు యంగ్ గన్స్ కు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.

అయితే బీసీసీఐ నోటీసులు అందిన వెంటనే పాండ్యా క్షమాపణలు కోరాడు. క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇటీవలే పాండ్యా, మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మహిళలను కించ పరుస్తూ పాండ్యా చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబట్టారు. తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడటమే కాదు సెక్సిస్ట్, ఉమెన్ హేటర్ లాంటి పదాలను ఉపయోగిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. తల్లిదండ్రులతో కలిసి తాను ఓ పార్టీకి వెళ్లిన విషయాన్ని తనకు ఎంతమంది యువతులతో సంబంధాలు ఉన్నదీ, తాను వర్జీనిటీని కోల్పోయిన రోజు.... ఆ విషయాన్ని అమ్మానాన్నలకు ఎలా చెప్పానన్న విషయాన్నీ షోలో పాండ్యా వివరించి చెప్పాడు. దీంతో.. అతనిపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపడ్డారు.

'' కాఫీ విత్ కరణ్ షోలో తాను చేసిన వ్యాఖ్యలు చాలా మంది మనోభావాలను దెబ్బతీసినట్లుగా తెలిసిందని తాను ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరి హృదయాన్ని గాయపరచాలని చేసింది కాదని కాఫీ విత్ కరణ్ షో తీరే అలాంటిదంటూ వివరణ ఇచ్చాడు. అందుకే ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నట్లు'' ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. మరోవైపు హార్థిక్ పాండ్యాను వివరణతోనే సరిపెట్టకుండా బీసీసీఐ కఠినంగా శిక్షంచాలని అంతర్జాతీయ క్రికెటర్లు ఎంత హుందాగా ఉండాలో తెలిసేలా చేయాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories